కుటుంబాలలో అంతర్జాలం ఒక అవసరమైన సాధనంగా మారింది. ఇంట్లో కంప్యూటర్లు లేదా మొబైల్ ఫోన్లు తరచుగా పిల్లలు మరియు యువకులతో పాటు కుటుంబంలోని అందరు సభ్యులు పంచుకుంటారు. అంతర్జాలం రకరకాల వనరులతో మీమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని కలపగలదు. కంప్యూటరు అంతర్జాలాన్ని ఉపయోగించి మీరు మరియు మీ కుటుంబం తాజా వార్తలను చదవచ్చు, సమాచారాన్ని వెతకవచ్చు, ఆన్ లైన్ కొనుగోలు చేయవచ్చు, ఇంట్లోకి కావలసిన వస్తువులను ఆన్ లైన్లో నమోదు చేసుకోవచ్చు, సంగీతం వినవచ్చు, ఆటలు ఆడొచ్చు, వస్తువులు కొనొచ్చు లేదా స్నేహితులకు ఇ-మెయిల్ చేయవచ్చు. అంతర్జాలంలో నేర్చుకోవటానికి మరియు తెలుసుకోవటానికి అంతేలేదు. అయితే ఇక్కడ దొరికే సమాచారం అంతా మరియు అన్ని వనరులు నమ్మదగినవి కావు.

అంతర్జాలంలో ఆన్ లైన్ కొనుగోలు చేస్తున్నప్పుడు మరియు సాఫ్ట్ వేర్ లేదా ఫైళ్ళను దిగుమతి (డౌన్లోడ్) చేసుకొనేటప్పుడు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సురక్షితమైన, విజ్ఞానంతో కూడిన మరియు సరదా అనుభవం కావాలంటే ఏమి చేయాలి. మీరు చేయబోయే అన్ లైన్ కార్యకలాపాల గురించి మీ కుటుంబ సభ్యులందరితో చర్చించాలి. మీ వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారం సురక్షితంగా ఉండటానికి పెద్దల పర్యవేక్షణ అవసరం.

అంతర్జాలం ద్వారా మీరు ఇతర వ్యక్తులతో మరియు ఇతర వనరులతో సంబంధాన్ని నెలకొల్పుకోవటం సహజం. ఈ క్రమంలో కొందరు మీ ఉపకరణాలలోకి చొచ్చుకుని వచ్చే ప్రమాదం కొంత ఉంది. కంపెనీల ద్వారా మీరు అంతర్జాలంలో ఏమిచేస్తున్నారో జాడ(ట్రాక్) తెలుసుకోవటం వంటి ఇంకా కొన్ని ఇతర ప్రమాదాలు కూడా ఉన్నాయి. మీరు అంతర్జాలంలో సురక్షితంగా ఉంటారని ఎటువంటి హామీ లేదు, కానీ అంతర్జాలాన్ని ఉపయోగించేటప్పుడు మీరు మరియు మీ కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉండటానికి అనేక చర్యలు తీసుకోవచ్చు. అంతర్జాలం సమాచారం మరియు సలహా పొందటానికి సహాయకరి కావచ్చు, కానీ చదివిన ప్రతీదానిని మీరు మరియు మీ కుటుంబ సభ్యులు నమ్మకండి. ఎవరైనా ఏదైనా సమాచారాన్ని అంతర్జాలంలో ఉంచవచ్చు, అన్నీ నమ్మదగినవి కావు. కొందరు వ్యక్తులు మరియు సంస్థలు వారు పోస్ట్ చేసిన సమాచార ఖచ్చితత్వం గురించి జాగ్రత్తగా అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. సమాంతరంగా, కొందరు కావాలని తప్పుడు సమాచారాన్ని పోస్టు చేయవచ్చు.

మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అంతర్జాలాన్ని ఉపయోగిస్తున్నప్పుడు క్రిందివాటిని మనసులో ఉంచుకోవటం ముఖ్యం:

  • ఆన్ లైన్ సమాచారం సాధారణంగా వ్యక్తిగతం కాదు.
  • ఆన్ లైన్ లో ఉన్న వారు మీరనుకుంటున్న వాళ్లు కాక పోవచ్చు.
  • ఎవరైనా సమాచారాన్ని ఆన్ లైన్ లో ఉంచవచ్చు.
  • మీరు ఆన్ లైన్ లోచదివిన ప్రతిదాన్ని నమ్మకండి.
  • మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అనుకోకుండా మరియు తెలియకుండా హానికర, అశ్లీల (బాల అశ్లీలంతో సహా), అసభ్య, హింసాత్మక లేదా జాత్యహంకార సంబంధమైన సామాగ్రిని చూడవచ్చు.

దీనికోసం ISEA-అవగాహనా కార్యక్రమం మొత్తం కుటుంబ సభ్యులు కోసం చిట్కాలు మరియు సలహాలను ఎల్లప్పుడూ అందిస్తుంది. దయచేసి, ముచ్చట్ల (చాటింగ్) అప్పుడు, సామాజిక మాధ్యమాలల్లో పాల్గొనేటప్పుడు, ఆన్ లైన్ కొనుగోలప్పుడు లేదా ఫైళ్లు, ఆటలు లేదా ఇతర సాఫ్ట్వేర్ దిగుమతి అప్పుడూ సురక్షితంగా ఉండటానికి కింది దశలను అనుసరించండి.

దశ 1: మీ ఇంటి Wi-Fi నెట్వర్కును సురక్షితం చేసుకొండి.

మీ ఇంట్లో ఇప్పుడు Wi-Fi ఉండవచ్చు. దీనివలన మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఇంట్లో ఎక్కడి నుండి అయినా అంతర్జాలాన్ని వాడవచ్చు. ఇలాంటప్పుడు అంతర్జాల కార్యకలాపాలు మరియు సమాచార వినిమయాన్ని నియంత్రించడం మీకు కష్టం అవుతుంది. అది సరిగా సురక్షితం చేయకోపోతే, చొరబాటుదారు మీ బ్యాండ్విడ్త్ ను ఉపయోగించుకోడానికి, లేదా మాల్వేర్ మీ పరికరాలలో ప్రవేశించటం ద్వారా మీ అంతర్జాల భద్రత క్షీణించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక వారు మీ వ్యవస్థల నుండి ఇతర వ్యవస్థలు లేదా ఉపకరణాలపై దాడులు చేసేందుకు మీ పరికరాలు లేదా వ్యవస్థలను “బాట్” గా ఉపయోగించవచ్చు.

  • డిఫాల్ట్ నిర్వహణ (అడ్మిన్) పాస్వర్డును సురక్షితమైనదిగా మార్చండి.
  • మీ Wi-Fi పరికరాన్ని అత్యంత సురక్షితమైనదిగా చేయండి
  • మీ రౌటర్ ఉపయోగించటానికి ఒక బలమైన పాస్వర్డును ఉపయోగించండి.
  • అపరిచితులు మీ నెట్వర్కును చూసి ఉపయోగించడాన్ని నిరోధించడానికి ఎన్క్రిప్షన్ వైర్లెస్ ప్రారంభించండి.
  • మీ వైర్లెస్ నెట్వర్క్ ఉపయోగాన్ని నిర్దిష్ట పరికరాలకు మాత్రమే అనుమతించండి. నెట్వర్కుతో అనుసంధానించగల ప్రతి పరికరానికి ఒక ప్రత్యేక మీడియా యాక్సెస్ కంట్రోల్ (MAC) చిరునామా ఉంటుంది, కాబట్టి వాటిని ఉపయోగించండి.
  • అసంగత సమాచారం గల అనవసర వెబ్ సైట్లను నివారించేందుకు వడపోత (ఫిల్టర్) ఎంపికలను ఉపయోగించండి.

దశ 2: పిల్లలు మరియు కుటుంబ సభ్యులకు ఒకే ప్రదేశాన్ని కంప్యూటరు కొరకు కేటాయించండి

కుటుంబ సభ్యులు అందరికీ అందుబాటులో ఉన్న సాధారణ గదిలో కంప్యూటరును ఉంచడం పిల్లలు మరియు వృద్ధల కోసం అత్యంత ముఖ్యమైనది. దీని వలన పిల్లలు అంతర్జాలంలో గడిపే సమయాన్ని నియంత్రించవచ్చు మరియు వృద్ధులు అంతర్జాల సహాయంతో కొత్త సాంకేతికలను ఉపయోగించి వివిధ విశయాలను నేర్చుకోవడాని సహాయం చేయడానికి వీలుంటుంది.

దశ 3: అంతర్జాలాన్ని ఉపయోగించడానికి కుటుంబ నియమాలను ఏర్పరచండి

మీ కుటుంబ సభ్యులుకు సహాయపడటం కోసం అంతర్జాలాన్ని ఉపయోగించేటప్పుడు చేయవలసినవి పనులు మరియు చేయకూడని పనుల నియమాలు తయారు చేయాలి. స్మార్ట్ ఫోన్లు మరియు టాబ్లెట్ కంప్యూటర్ల వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడానికి కూడా స్పష్టమైన నియమాలు, ప్రమాణాలను తయారు చేయాలి. దీనికోసం కిందివాటిని మీరు పరిగణలోకి తీసుకోవచ్చు:

  • అంతర్జాలాన్ని ఉపయోగించే ముందు మీ అనుమతి తీసుకోమని మీ కుటుంబ సభ్యులకు, ఉదా మీ పిల్లలకు, చెప్పడం.
  • కంప్యూటర్లు మరియు ఇతర పరికరాలను రోజుకు లేదా వారానికి ఎంత సమయం ఉపయోగించాలో మరియు రోజులో ఏ సమయంలో ఉపయోగించాలో సమయ పరిమితులను విర్ణయించడం.
  • మీ పిల్లలు సామాజిక మాధ్యమాల (సోషల్ నెట్వర్కింగ్) సైట్లును ఉపయోగించటానికి అనుమతివ్వాలని మీరు నిర్ణయించుకుంటే, ఉపయోగించటంలో పరిమితులు పెట్టండం.
  • మీ పిల్లలు ఉపయోగించే సామాజిక మాధ్యమాల సైట్లలో చేరడం, దానివల్ల వారు దేనిని పంచుతున్నారో విశ్లేషించవచ్చు.

ఆన్ లైన్లో కలిసేవారిలో అపరిచితులు అయి ఉండొచ్చు అని మీ కుటుంబ సభ్యులకు గుర్తుచేయండి

మీరు ఎంత తరుచుగా ఆన్ లైన్ "స్నేహితుల" తో ముచ్చుట్లు పెట్టినా, మీరు ఎంతకాలంగా వారితో ముచ్చట్లు పెడుతున్నా, వారి గురించి మీకు చాలా తెలుసు అనుకున్నా, మీరు ఆన్ లైన్లో కలుసుకునే వారు అపరిచితులు.

మీరు ఆన్ లైన్లో ఉన్నప్పుడు మీరు ఎవరో వేరేవారని అబద్ధంచెప్పి నటించటం సులభం. ముఖ్యంగా పిల్లలు తెలుసుకోవలసినది ఏమిటంటే కొత్త "స్నేహితులు" మీ వయసు కాకుండా నిజానికి 40 ఏళ్ల వ్యక్తి కూడా కావచ్చు. కాబట్టి ఆన్ లైన్ లో కలిసిన వారు అపరిచితుల అయి ఉండవచ్చు అని మీ కుటుంబ సభ్యులకు దయచేసి గుర్తుచేయండి

దశ 4: ఆన్ లైన్ భద్రత అవసరాన్ని తెలుసుకొని హద్దులు ఎర్పరుచు

ప్రతి కుటుంబ సభ్యునికి కంప్యూటర్ మరియు అంతర్జాలాన్ని ఉపయోగించటంలో వివిధ విషయాలు అవసరం కావచ్చు. ఏది సరియైనదో ఏది సరియైనది కాదో సరిగ్గా నిర్ణయించండి

  • ఉపయోగించ దగిన వివిధ వెబ్ సైట్ల వాడకం,
  • గమనించ దగిన ముచ్చట్ల (చాట్) గదులు మరియు చర్చా వేదిక (ఫోరమ్)లను ఉపయోగించటం
  • నిజమైన గుర్తింపు బహిర్గతం కాని లేదా రెచ్చగొట్టని పేర్లను ఎప్పుడూ వాడటం
  • ఆన్ లైన్ ఖాతాకు బలమైన, ప్రత్యేకమైన మరియు సులువుగా గుర్తుండే పాస్వర్డులను ఉపయోగించటం
  • ఫోన్ నంబర్లు, కుటుంబ సభ్యుల పేర్ల వెల్లడి వంటి ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని పోస్ట్ లేదా పంపిణీ చేయము అని ప్రతిజ్ఞ చేయటం
  • అనుచిత ఫోటోలు లేదా మీ గుర్తింపును వెల్లడించే (ఉదాహరణకు నగరం లేదా పాఠశాల పేర్ల చొక్కాలు) వంటివి పోస్ట్ చేయమని మీ కుటుంబ సభ్యుల మాట తీసుకోవటం
  • కుటుంబానికి తెలియజేయకుండా ఆన్ లైన్లో కలసిన అపరిచితులతో వ్వక్తిగతంగా కలవకపోవటం
  • అపరిచితుల నుండి వచ్చిన మెయిల్స్ మరియు జోడింపులకు స్పందించమని మాటివ్వటంli>
  • సైబర్ వెక్కిరింపులు, బెదిరింపులు, వగైరాల వంటి విసుగు కలిగించే విషయాలు, కంప్యూటర్ మరియు అనువర్తనాల ఏదైనా వింత ప్రవర్తనను గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తామని హామీ ఇవ్వటం

గోప్యతా నియమాలు అనుసరించండి

ఖాతా తెరవడానికి మీనుంచి ప్రాథమిక సమాచారాన్ని తీసుకొనే సామాజిక మాధ్యమాలు లేదా వెబ్సైట్లు - Facebook, Google+ మొదలైనవి - గోప్యతా విధానాలను కలిగి ఉంటాయి. మీరు (లేదా మీ కుటుంబ సభ్యులు) ఒక కొత్త మాధ్యమంలో చేరాలనుకునే ప్రతిసారీ గోప్యతా విధానాన్ని చదవండి. దానివలన దాని రూపకర్తలు ఏ విధంగా మీ సమాచారాన్ని ఉపయోగించుకుంటారో తెలుస్తుంది. అంతేకాకుండా ఫిషింగ్ మరియు గుర్తింపు అపహరణ వంటి అంతర్జాల భద్రతా ప్రమాదాలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకోవాలి

దశ 5: సరియైన ఆన్ లైన్ ప్రవర్తన కోసం కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందం మరియు ఆన్ లైన్ ప్రతిజ్ఞ సంతకం

కంప్యూటరును తగిన నిధంగా ఉపయోగించటం మరియు అంతర్జాల వినియోగాన్ని సరైన పద్ధతిలో చేయటం గురించి అందరు కుటుంబ సభ్యుల మధ్య స్పష్టమైన అవగాహన ఉండేందుకు ఆన్ లైన్ ప్రవర్తనా ఒప్పందాన్ని సిద్ధం చేయండి. ఇది అంతర్జాలాన్ని వినియోగిస్తున్నప్పుడు అందరు కుటుంబం సభ్యుల భద్రతకు సహాయపడుతుంది.

కుటుంబంలోని సభ్యులు కంప్యూటర్ మరియు అంతర్జాల భద్రత కోసం కింద తెలిపిన విధంగా ప్రతిజ్ఞ చేయటం మంచిది

ప్రతిజ్ఞ

కంప్యూటర్ మరియు అంతర్జాలం జ్ఞానం పొందటానికి, వస్తువులు ఎలా పని చేస్తాయో తెలుసుకోవడానికి, పని చేయడానికి, ఆడటానికి, ముచ్చుట్లకు మరియు కలిపి ఉండేందుకు అవకాశాన్ని కలిపిస్తాయి. దీనికోసం నేను నా భద్రత మరియు కుటుంబం భద్రతను వదులుకోను, మేము ఆన్ లైన్ భద్రత మరియు ప్రవర్తనను అంగీకరించాము

  • నేను నా కంప్యూటరు మరియు అంతర్జాల ఉపయోగాల భద్రత మరియు రక్షణ నియమాలన్నిటిని అనుసరిస్తాను
  • నేను నా ఫోన్ నంబర్, చిరునామా, లేదా పాస్వర్డులతో సహా ఎలాంటి గుర్తింపును బహిర్గతం చేయను
  • ఆన్ లైన్లో కలుసిన వ్యక్తులతో వ్యక్తిగతంగా ఎప్పటికీ కలవను. అవసరమయితే నా కుటుంబం సభ్యులతో పాటు వెళ్లి కలుస్తాను
  • నేను ఏదైనా అసౌకర్యమైన, అసురక్షితమైన లేదా అసాధారణ పరిస్థితిలో ఉంటే లేదా ఏదైనా పరికరం యొక్క ప్రవర్తన అసాధారణంగా ఉంటే, నేను సహాయం కోసం నా కుటుంబ సభ్యులకు (నా తండ్రి / సంరక్షకుడు/గురువు) తెలియజేస్తానని హామీ ఇస్తున్నాను
  • నేను నా భద్రత, నా కుటుంబ భద్రతే కాక నా దేశాన్నీ సైబర్ సురక్షిత భారతదేశంగా మలవడానికి ఈ ప్రతిజ్ఞకు లోబడి ఉంటాను.
  • మీ తండ్రి/సంరక్షకుడు/గురువుగా, నేను మీరు సహాయం అడిగినప్పుడు మీకు అందుబాటులో ఉంటానని వాగ్దానం చేస్తున్నాను మరియు తలెత్తే ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి సహాయం చేస్తాను
Page Rating (Votes : 16)
Your rating: