సంస్థ సమాచార సంపర్క మరియు సాంకేతిక (ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ -ఐసిటి) సౌకర్యాలను మరియు పరికరాలను ఉపయోగించేటప్పుడు అందరు ప్రభుత్వ ఉద్యోగులు దానిని బాధ్యతగా తీసుకోవాలి. దీనిలో అంతర్జాలం, ఫోన్, ఇమెయిల్, ప్రింటర్, వై-ఫై మొదలైన వ్యవస్థల ఉపయోగం (సిస్టం ఆక్సెస్), నెట్వర్కు మరియు సేవలు వస్తాయి. మీ ఇంటర్నెట్, ఇంట్రానెట్ మరియు ఇమెయిల్లతో సహా ఐసిటి సౌకర్యాల ఉపయోగాన్ని సంస్థ పర్యవేక్షిస్తుంది మరియు నమోదు చేస్తుంది. విభాగం యొక్క ఇమెయిల్ ప్రణాలిక అధీకృత నమోదు సంరక్షణ (రికార్డుకీపింగ్) వ్యవస్థ కాదు. ఉద్యోగులు సంస్థ యొక్క ఐసిటి సౌకర్యాలు మరియు పరికరాలను ఉపయోగించేటప్పుడు సంస్థ యొక్క తగిన నివియోగ విధానాలను అనుసరించాలి. ప్రభుత్వ ఉద్యోగులు అధికారిక సమాచారాన్ని చాలా జాగ్రత్తగా నిర్వహించాలి.

ప్రభుత్వ ఉద్యోగులు విశ్వసనీయత మరియు గోప్యతలకు కట్టుబడి ఉండాలి. సంస్థ పరికరాల వాడకం మరియు నిల్వ, పునరుద్ధరణ, వినియోగం మరియు వ్యవస్థ మరియు నెట్వర్కుల సమాచారాన్ని బయటకు ఇచ్చేటప్పుడు వాణిజ్య సున్నితత్వాల ప్రమాణాలు, పధ్ధతులు మరియు అవసరాలను అనుసరించాలి.

దయచేసి క్రింది ప్రశ్నలకు సమాధానమివ్వండి:

  1. మీకు అధికారిక ఇ-మెయిల్ ఐడీ ఉందా?
  2. మీరు అంతర్జాల నైతికతను అనుసరిస్తారా?
  3. మీ సంస్థలో ఒక వినియోగ విధానం ఉందా?
  4. మీ సంస్థ వనరులను ఉపయోగించడానికి/వాడటానికి ఏవైనా ప్రణాళికా మార్గదర్శకాలు ఉన్నాయా?
  5. మీ సంస్థలో ఏదైనా రహస్య సామాచారాన్ని నిర్వహిస్తుంటారా?
  6. మీ అధికారిక కంప్యూటరులో ఏదైనా దిగుమతి (డౌన్లోడ్) చేస్తారా?
  7. మీ సంస్థలో భద్రతా విధానాలు ఉన్నాయా?

మీమ్మల్నీ మరియు వ్యవస్థీకృత వనరులను పరిరక్షించడానికి అందించిన మార్గదర్శకాలను కింద చూడండి.

అంతర్జాలాన్ని వినియోగించేటప్పుడు ఎప్పుడైనా అంతర్జాల నైతిక సూత్రాలను మరియు కంప్యూటరు వాడకాన్ని రక్షించే నీతి సూత్రాలను అనుసరించండి. కంప్యూటర్ నైతిక యొక్క సాధారణ సమస్యలలో ఒకటి, టోరెంట్స్ మొదలైనవి వాటి నుండి అక్రమ దిగుమతి (డౌన్లోడ్) వంటి, కాపీరైట్ ఉల్లంఘన. ఇంకా అంతర్జాలం నుంచి పత్రం/పేపరు దిగుమతి చేసి రచయిత మొదలైనవి వారి నుంచి సరైన అనుమతి లేకుండా ఇతరులకు పంపిణీ చేయటం..

మీరు ఎప్పుడైనా అంతర్జాలంలో నిజాయితీగా ఉండాలి, ఇతరుల హక్కులను మరియు ఆస్తులను గౌరవించాలి. అంతర్జాలం విలువలు లేని ప్రదేశం కాదని అందరూ అంగీకరించాలి. అంటే విలువకు ఒక విస్తృతమైన అర్థాన్ని కలిగిన ప్రదేశం వరల్డ్ వైడ్ వెబ్. అందువలన, కంటెంట్ మరియు సేవలు రూపొందించే సమయంలో దీనిని పరిగణలోకి తీసుకోవాలి. అంతర్జాలం సార్వత్రిక సమాజం కాదు అందులో ఒక ప్రాథమిక భాగం మాత్రమే అని గుర్తించాలి..

ఎల్లప్పుడూ వ్యవస్థలు/ల్యాప్ టాపుల్లో బలమైన ప్రవేశ (లాగిన్) పాస్వర్డ్ ఉపయోగించండి మరియు 30 రోజులకు ఒకసారి దానిని మార్చవలసిన అవసరం ఉంటుంది. మీ సంస్థ వెలుపలి వ్యక్తులతో పనికి సంబంధిత సమాచారాన్ని పంచుకోవద్దు. ఫిషింగ్, విషింగ్, బైటింగ్, డంప్స్టెర్ డైవింగ్ మొదలైన సామాజిక ఇంజనీరింగ్ విధానాలు మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడానికి చలామణిలో ఉన్నాయి. ఇది భద్రత ఉల్లంఘన జరుగుతోందని తెలియనీయకుండా తంత్రంతో ప్రజలు సమాచారాన్ని పొందే ప్రక్రియ. ఇది రూపం మార్చి, టెలిఫోన్ ద్వారా, వ్యక్తిగతంగా, ఇమెయిల్ ద్వారా మరియు మాటల రూపంలో దీనిని చేయవచ్చు. కొన్ని ఇమెయిల్స్ మీ కంప్యూటరులో వైరస్ లేదా హానికరమైన ప్రోగ్రామ్ పంపడానికి ఒక అటాచ్మెంటును తెరవడానికి ప్రేరేపిస్తాయి. వేరే వ్యక్తులకు సమాచారాన్ని ఇవ్వడానికి మీరు కాగితం/ఇ-మెయిల్ పద్ధతులు అనుసరించాలి మరియు రిసెప్షన్/ఫ్రంట్ డెస్కులు ఇలాంటి సామాజిక ఇంజనీరింగ్ దాడులపై అవగాహన కలిగి ఉండాలి..

అంతర్జాలాన్ని వినియోగిస్తున్నప్పుడు, వ్యక్తిగత సమాచారం వెల్లడి అయ్యే ప్రమాదాలు ఉండకుండా ఉండేందుకు "ఈ కంప్యూటరులో నా ఐడీ గుర్తుంచుకో" వంటి ఎంపికలను డిసేబుల్ చేయటం వంటివి చేసి బ్రౌజర్ భద్రతను తనిఖీ చేయాలి. తర్వాత వచ్చే వినియోగదారుని ద్వారా పాస్ వర్డు ట్రాక్ ను నివారించేందుకు వినియోగదారు ఇడీ లేదా వినియోగదారు పేరు కూడా సురక్షితం చేయాలి. ఇటువంటి దాడులు నివారించేందుకు మొజిల్లా ఫైర్ఫాక్స్ (Mozilla Firefox) వెబ్ బ్రౌజర్లో "ప్రైవేట్ బ్రౌజింగ్" మరియు గూగుల్ క్రోమ్ (Google Chrome) వెబ్ బ్రౌజర్లో "ఇంకాగ్నిటో విండో" ఐచ్ఛికాన్ని ఉపయోగించడం మంచిది.

మీ కంప్యూటర్ వేగంగా మరియు సురక్షితంగా పనిచేయడానికి మీ కంప్యూటర్ ఆపరేటింగ్ వ్యవస్థను నూతనీకరించటం (అప్ డేట్) చాలా ముఖ్యం. వివిధ పీసీ లలో పనిచేస్తున్న ఆపరేటింగ్ వ్యవస్థల భద్రత మొత్తం నెట్వర్క్ భద్రతలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నెట్వర్క్ లో ఒక వ్యవస్థను నవీకరించక పోతే నెట్వర్కులోని ఇతర వ్వవస్థల భద్రత ప్రభావితం అవుతుంది. ఈ రోజుల్లో మనం ఎన్నో విశేషతలు గల అత్యాధునిక ఆపరేటింగ్ వ్యవస్థలను కలిగి ఉన్నాము, కానీ వాటిని ఆకృతీకరించటం (కాన్ఫిగర్) మరియు సరిగా పర్యవేక్షించకపోతే అవి దెబ్బతినే అవకాశం ఉంది. కొన్నిసార్లు తాజా అతుకులుతో (ప్యాచేస్) ఆపరేటింగ్ సిస్టమ్ నవీకరించినప్పుడు ఇతర ఆపరేటింగ్ వ్యవస్థల మద్య సమస్యలు రావచ్చు. అందువల్ల ఒక ప్రత్యేక సిస్టమ్/పీసీ లో ఆపరేటింగ్ వ్యవస్థ నవీకరించడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రభుత్వ ఉద్యోగులు మొబైల్ ఫోన్లను వాడుతూ ఉంటే, వాటి క్రమ సంఖ్య/మోడల్ సంఖ్య మరియు IMIE సంఖ్యలను ఒక ఆస్తుల నమోదు పుస్తకంలో ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో నమోదుచేయాలి. వారు వ్యక్తిగత మొబైల్/పోర్టబుల్ పరికరాలతో సంస్థ నెట్ వర్కును ఉపయోగిస్తుంటే వారి ఐటీ మేనేజరు/డైరెక్టర్ నుండి వ్రాతపూర్వక ఆమోదం పొందాలి. ఎల్లప్పుడూ మీరు వాడుతున్న పరికరాలు ఐటీ భద్రతా విధానాలకు అనుకూలంగా ఉండాలి. పరికరాలకు సురక్షితమైన పాస్ వర్డులను ఉపయోగించాలి మరియు ఉపయోగంలో లేనప్పుడు లాక్ చేయాలి.

సంస్థ ఐసీటి సౌకర్యాలు, వ్యవస్థలు, నెట్వర్క్ లేదా సేవలు ఉపయోగిస్తుండగా ఉద్యోగి వ్యక్తిగత పరికరాలు పాడైతే లేదా నష్టపోతే యాజమాన్యం ఏ మరమ్మత్తులు లేదా నిర్వహణ బాధ్యతను వహించదు. ఇంకా సంస్థ ఉద్యోగి వ్యక్తిగత పరికరాలకు ఏ సాంకేతిక లేదా సాఫ్ట్ వేర్ మద్దతు అందించదు. సమాచార మరియు వ్యవస్థ బ్యాకప్ విధానాలు మరియు భద్రపరచటం (ఆర్కైవ్) సరియైన స్థానంలో ఉండాలి. దీనివలన నష్ట పునరుద్ధరణ కార్యక్రమంలో ఆమోదయోగ్యమైన ప్రమాణాలు వాడి వ్యాపారం కొనసాగింపును నిర్ధారించవచ్చు.

Page Rating (Votes : 38)
Your rating: