ప్రస్తుత శకంలో, ప్రతి వ్యక్తి తమ జీవితంలోని గడియా ఇంటర్నెట్ చుట్టు తిరుగుతుంది. ప్రతి వ్యక్తుల మధ్య సంభాషణ సైబర్ స్పేస్ లోనే జరుగుతుంది. దీని వలన ఈ ఇంటర్నెట్ వ్యసనం రుగ్మత (IAD) లేదా మరింత విస్తారంగా ఇంటర్నెట్ ఉపయోగించడం, సమస్యాత్మక కంప్యూటర్ / స్మార్ట్ ఫోన్ వాడుకం వలన జరుగుతుంది. అంతర్గత వ్యసనం అనేది తప్పనిసరిగా ఏవైనా ఆన్లైన్ సంబంధిత ప్రవర్తన ఇది సాధారణ జీవనశైలితో భిన్నంగా ఉండడము వలన కుటుంబం,మిత్రులు,ప్రియమైన వారు  మరియు వాటిపై పనిచేసే పర్యావరణంపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. దీనిని ఇంటర్నెట్ డిపెండెన్సీ మరియు ఇంటర్నెట్ వ్యసనంగా పిలువబడుతుంది.

ఇంటర్నెట్ వినియోగించడానికి కారణాలు:

విసుగుదల / డిప్రెషన్:

ముఖ్యంగా ఒంటరి స్త్రీలు విసుగువలన, ఇంటర్నెట్ లో సోషల్ మీడియాకు అలవాటు పడతారు. వారు తరుచుగా సోషల్ మీడియా ప్రొఫైల్ని, వారి స్టేటస్లో కొత్త అప్డేట్స్ మరియు ఇతరుల స్టేటస్ అప్డేట్స్, ఇష్టాల సంఖ్య మరియు షేర్స్.
ఇది ఒక వ్యక్తి ఆలోచనా నిమగ్నత దీని వలన ఆమె మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

ఒత్తిడి మరియు పలాయనవాదం:

కార్యాలయంలో లేదా కుటుంబ జీవితంలో ఒత్తిడికి గురైన పలువురు మహిళలు తమ ఒత్తిడిని తగ్గించడానికి మరియు ఒత్తిడితో కూడిన పరిస్థితిని వదిలించుకోవడానికి ఇంటర్నెట్ అనే సులభమైన మార్గాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు.

ఇంటర్నెట్ కి సంబంధించిన చర్యలు

సోషల్ మీడియా:

చాలామంది మహిళలు సోషల్ మీడియాకు అలవాటు పడుతున్నారు. చాలామంది సోషల్ మీడియా ప్రొఫైల్ను తనిఖీ చేయడం ద్వారా తమ రోజును ప్రారంభిస్తారు లేదా ప్రస్తుతం ప్రధాన ధోరణి ప్రకారము నకిలీ ఫోటోలను అప్డెట్ చేస్తారు. ఈ సైబర్ ప్రపంచంలో మీ జీవితంలోని ప్రతి సెకనును సోషల్ మీడియాలో అప్డెట్ చేయడము మరియి వాటికి వచ్చే స్పందనను అంచనా వేయడం, అప్డెట్ చేసిన  పోస్ట్ కోసం వచ్చే లైక్స్ను మరియు షేర్స్ ను  తెలుసుకోవాడానికి ప్రస్తుతం చాలా మంది మహిళలు ఇష్టపడతారు.

ఆన్లైన్ షాపింగ్:

మహిళా జీవితంలో అత్యంత ఆసక్తికరమైన విషయం షాపింగ్. మహిళలకు ఆన్లైన్ షాపింగ్ ద్వారా పూర్తిస్థాయిలో ప్రపంచంలోని షాపింగ్ని తమ దరికి చేర్చింది. ఒకవేళ వారు కొన్న లేదా కొనకపోయినా వివిధ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ లో వివిధ ఉత్పత్తుల కోసం తరుచుగా శోధిస్స్తారు. వారిలో చాలా మంది ఇంటర్నెట్ లో గడిపే సమయాన్ని తగ్గించేందుకు కష్టపడతారు.

ఆన్లైన్ గేమింగ్: 

కొంత మంది మహిళలు ఆన్లైన్ గేమింగ్ కు అలవాటు పడి బానిసలుగా తయారయ్యారు. చాలా మంది స్త్రీలు తమ విశ్రాంతి సమయాన్ని వాస్తవిక ప్రపంచంలో సాంఘీకంగా కాకుండా ఆన్లైన్ గేమింగ్లో వేచ్చించాడానికి ఇష్టపడతారు.

ఆన్లైన్ చాటింగ్:

అందరూ చాటింగ్ను ఉపయోగిస్తారు కానీ కొంత మంది చాటింగ్ చేయకుండా ఉండలేరు. అనేక సార్లు మహిళలు వారు వాస్తవ ప్రపంచంలో కన్న సామాజిక మాద్యమములో సంభాషించడానికి ఇష్టపడతారు.

ఇంటర్నెట్ వ్యసనం ఎలా గుర్తించవచ్చు?

 • స్మార్ట్ ఫోన్ను ఉపయోగిస్తున్నప్పుడు క్షేమాము లేదా ఉల్లాసం గల భావాన్ని కలిగి ఉండాలి.
 • కార్యకలాపాలు ఆపడానికి అసమర్ధత
 • స్మార్ట్ ఫోన్ లో ఆధిక సమయం గడపటానికి ఆరాటపడడము.
 • కుటుంబం మరియు స్నేహితులను నిర్లక్ష్యం చేయడం.
 • కంప్యూటర్ దగ్గర లేకపొవడము వలన ఖాళీగా, నిరాశగా చిరాకుగా ఉండడము.
 • కార్యకలాపాలు గురించి కుటుంబం మరియు స్నేహితులు దగ్గర అబధ్దాలు అడడము.
 • పాఠశాలలో లేదా పనిచేసే దగ్గర సమస్యలు

మీరు ఇంటర్నెట్కు అలవాటు పడడము ద్వారా, మీ భౌతిక మరియు మానసిక ఆరోగ్యంపై వివిధ రకాల సైబర్ బెదిరింపులకు సంబంధించిన సమస్యల ప్రభావం చూపుతుంది.

ఇంటర్నెట్ వ్యసనం నివారించడం ఎలా

 • మీరు ఇంటర్నెట్ వినియోగించే నిర్దిష్ట సమయమును నిర్దారించుకోవాలి.
 • సెల్ ఫోన్లో ఇంటర్నెట్ వాడకం మరియు రోజూ రోజును తగ్గించటానికి ప్రణాళికను అనువర్తించే ఒక అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోండి.
 • ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ను ఉపయోగించడాన్ని పరిమితం చేయడానికి మీ స్నేహితులు / కుటుంబం సభ్యుల నుండి సహాయం తీసుకోవాలి.
 • కంప్యూటర్ గేమ్స్ ని అన్ఇన్స్టాల్ చేయండి మరియు కనీసం ఒక నెల లేదా రెండు నెలలు కోసం సామాజిక నెట్వర్క్లు మరియు ఇతర వినోద వెబ్ కార్యకలాపాలు నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.
 • ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం సమయం కేటాయించండి సెట్, కానీ అది అతిగా ఉండకూడదు.
 • కథనాలు చదివడం, బ్రౌజింగ్, వీడియోలను చూడటం, మరియు ఇమెయిల్స్ పంపడం వంటి చర్యలను మార్చుకోండి.
 • అప్లికేషన్ మరియు ఇమెయిల్ ప్రకటనలను ఆపివేయండి.
 • వ్యసనపరమైన వెబ్సైట్లను నిలిపివేయడానికి ప్రయత్నించండి.
 • చదివే విషయాలు / జాబ్ సంబంధిత పుస్తకాలు / మేగజైన్కు మారండి. ఇది మీ పఠన అలవాటును పెంచుతుంది.
 • మీరు ఇంటర్నెట్ వాడకుండా ఉండడము వలన మీరు సేవ్ చేసుకోనే డబ్బు గురించి ఆలోచించండి.
 • మీరు ఇంటర్నెట్ను తక్కువగా ఉపయోగించడము వలన సంతోషంగా ఉంటారనే కారణాల జాబితాను రూపొందించండి.
 • బెడ్ రూములు నుండి ఇంటర్నెట్ ని ఉపయోగించడానికి వాడే పరికరాలను తీసివేయండి.
 • మీరు నిద్రించే పద్ధతిని నియంత్రించుకోవాలి. ఇంటర్నెట్ వలన  చాలామంది నిద్రని పోగొట్టుకుంటారు మరియు వారు నిద్రించే పద్ధతి వలన విసిగిపోతారు. మీరుమరింత వ్యవస్థీకృతంగా మరియు స్వీయ క్రమశిక్షణతో ఉంటే ఇది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది.
Page Rating (Votes : 16)
Your rating: