మనము "నైతికత" గురించి మాట్లాడినప్పుడు, ఒక వ్యక్తి లేదా సమూహనికి కలిగి ఉన్న వైఖరి, విలువలు, నమ్మకాలు మరియు అలవాట్లను సూచిస్తాము.  నీతి అనేది నైతికత అధ్యయనం. ఇంటర్నెట్ నైతిక సమస్యలు అన్ని వ్యక్తిగత, సామాజిక మరియు ప్రపంచ సమస్యల సూత్రాలతో వ్యవహరిస్తాయి. సరళంగా చెప్పాలంటే, కంప్యూటర్ నైతికత అనేది కంప్యూటర్ల వినియోగాన్ని నియంత్రించే నైతిక సూత్రాల సమితి. అవి ఒక వ్యక్తి లేదా సమూహాం కంప్యూటర్ను ఉపయోగించేటప్పుడు ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఏంటి అని గుర్తించి, పాలించే నైతిక సూత్రాల సమితి. మనకు తెలిసినట్టుగా, కంప్యూటర్ ఒక సమర్థవంతమైన సాంకేతిక మరియు ఇది అనేక నైతిక సమస్యలను పెంపొందించుతుంది. వ్యక్తిగత చొరబాటు, మోసగించడం, గోప్యత ఉల్లంఘన, సైబర్ బెదిరింపు, సైబర్ స్టాకింగ్ (వెక్కిరించడం), పరువు నష్టం (అపకీర్తి), టెక్నాలజీ ఎగవేత లేదా సామాజిక బాధ్యత మరియు మేధో సంపత్తి హక్కులు అనగా కాపీరైట్ చేయబడిన ఎలక్ట్రానిక్ కంటెంట్ వంటి నైతిక సమస్యలను పెంపొందించుతుంది.

అందరి కోసం ఇంటర్నెట్ ఎథిక్స్

అంగీకారం (ఆమోదం)

ఇంటర్నెట్ అనేది  ఒక  విలువ (స్వేచ్ఛా) లేని జోన్ కాదు అని అంగీకరించాలి. దీని అర్థం వరల్డ్ వైడ్ వెబ్ అనేది విస్తృత పరిధిలో పరిగణించబడే ప్రదేశం, ఇంటర్నెట్ని విశ్వవ్యాప్త సమాజంగా గుర్తించకపోయినా అది దాని యొక్క ప్రధాన భాగం. అందువల్ల కంటెంట్ మరియు సేవలను రూపొందిస్తున్నప్పుడు చాలా శ్రద్ధ వహించాలి.

జాతీయ మరియు స్థానిక సంస్కృతులకు సున్నితత్వం

జాతీయ మరియు స్థానిక సంస్కృతుల అవరోధం ఉండకూడదు,  ఇది అందరికి చెందినది. ఇది స్థానిక టీవీ చానెల్ లేదా స్థానిక వార్తాపత్రిక వంటి విలువలకు లోబడి ఉండకూడదు.దిని వల్ల బహుళ ఉపయోగం కల్పించేటట్టుగా ఉండాలి.

ఇ-మెయిల్ మరియు చాటింగ్ ఉపయోగించడం

కుటుంబం మరియు స్నేహితులతో సంభాషించడానికి ఇంటర్నెట్ను తప్పక వాడాలి. తెలియని వ్యక్తులతో / అపరిచితుల నుండి ఇ-మెయిల్స్ను అపరిచితులతో చాట్ చేయకుండా ఉండాలి. అపరిచిత వ్యక్తులతో ఇ-మెయిల్స్ చాటింగ్ మరియు ఫార్వార్డ్ చేయడం వలన కలిగే నష్టాలను మనము తెలుసుకోవాలి.

వేరే వ్యక్తిగా నటించడము

వేరే వ్యక్తిగా నటిస్తు ఇతరులను మోసం చేయడానికి మనము ఇంటర్నెట్ను ఉపయోగించకూడదు. ఇంటర్నెట్ ప్రపంచంలో ఇతరులు మోసం చేసేందుకు మా సొంత గుర్తింపు దాచడం ఒక నేరం మరియు ఇతరులకు కూడా ప్రమాదం కావచ్చు.

చెడు భాష మానుకోండి

ఇ-మెయిల్, చాటింగ్, బ్లాగింగ్ మరియు సోషల్ నెట్ వర్కింగ్ లో మనం దుష్ప్రవర్తన లేదా చెడు భాషను ఉపయోగించకూడదు. మనము ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలి మరియు ఇంటర్నెట్లో ఎవర్ని విమర్శించకూడదు.

వ్యక్తిగత సమాచారాన్ని దాచుకోవాలి

ఇంటి చిరునామా, ఫోన్ నంబర్లు, ఆసక్తులు, పాస్వర్డ్లు వంటి వ్యక్తిగత వివరాలను ఇవరికి ఇవ్వకూడదు. ఫోటోలను అపరిచిత వ్యక్తులకు పంపకూడదు, ఎందుకంటే ఇది దుర్వినియోగానికి దారి తీయవచ్చు.

డౌన్లోడ్ చేస్తున్నప్పుడు

ఇంటర్నెట్ను వీడియోలను చూడటం మరియు ఆటలను ఆడటం, సమాచారాన్ని బ్రౌజ్ చేయడం లేదా డౌన్లోడ్ చేయడానికి ఉపయోగించవచ్చు. కాపీరైట్ల యొక్క ప్రాముఖ్యత మరియు కాపీరైట్ సమస్యల గురించి తెలుసుకోవాలి.

ఇంటర్నెట్ యాక్సెస్

ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికి పాఠ్యప్రణాళిక యొక్క అవకాశాలను విస్తరించే, సమయ-సమర్థవంతమైన సాధనం. నేర్చుకోవడం అనేది సంబంధిత మరియు విశ్వసనీయ సమాచారాన్ని సులభంగా మరియు త్వరగా కనుగొనే సామర్థ్యాన్ని మరియు ఆ సమాచారాన్ని ఎంచుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మరియు అంచనా వేయడానికి ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్లో సమాచారం కోసం శోధించడం వలన, పైన పేర్కొన్న నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. తరగతుల ఎక్సర్సిస్స్ మరియు టేక్-హోమ్ మదింపు పనులు, విద్యార్థులకు వెబ్ సైట్ విషయాలను సరిపోల్చడం అవసరమవుతుంది, వివిధ ప్రేక్షకులను ఉద్దేశించి, నిర్దిష్ట కంటెంట్ యొక్క, ఖచ్చితత్వం మరియు విశ్వసనీయతను గుర్తించడం మరియు నిర్ణయించడం కోసం వ్రాసే విషయాలను గురించి, విద్యార్థులను అప్రమత్తం చేసేందుకు ఉపయోగించవచ్చు. అనేక సైట్లు సమస్యల గురించి నిర్దిష్ట దృక్పథాలను స్వీకరిస్తాయి, ఇంటర్నెట్లో పొందుపరిచిన అభిప్రాయం నుండి ప్రత్యేకతను గుర్తించడం మరియు నిష్పాక్షికతను అన్వేషించడం కోసం ఉపయోగించే ఒక ఉపకరణం

ఇంటర్నెట్ వినియోగదారులు కోసం నైతిక నియమాలు

కంప్యూటర్ను ఉపయోగించేటప్పుడు అనుసరించాల్సిన కొన్ని నియమాలు క్రింద ఇవ్వబడ్డాయి:

  • ఇతర వినియోగదారులకు హాని కలిగించడానికి ఇంటర్నెట్ను ఉపయోగించకూడదు.
  • ఇతరుల సమాచారాన్ని దొంగిలించడానికి ఇంటర్నెట్ను ఉపయోగించవద్దు.
  • యజమాని అనుమతి లేకుండా ఫైళ్లను యాక్సెస్ చేయవద్దు.
  • అథార్ యొక్క అనుమతి లేకుండా కాపీరైట్ చేయబడిన సాఫ్ట్వేర్ను కాపీ చేయవద్దు.
  • ఎల్లప్పుడూ కాపీరైట్ చట్టాలు మరియు విధానాలను గౌరవించాలి.
  • ఇతరుల నుండి మీరు ఆశించిన విధంగానే, ఇతరుల గోప్యతను గౌరవించండి. 
  • ఇతరుల అనుమతి లేకుండా వారి కంప్యూటర్ వనరులను ఉపయోగించవద్దు.
  • ఒక వేళ అక్రమ కమ్యూనికేషన్ మరియు కార్యకలాపాలు గురించి కనుగొన్నట్లయితే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ మరియు స్థానిక చట్ట అమలు అధికారులకు ఫిర్యాదు చేయండి.
  • వినియోగదారులు వారి ఐడి మరియు పాస్వర్డ్లు కాపాడుకోవాలి. వారు కాగితం పైన లేదా మరెక్కడా రాసుకోకూడదు.
  • వినియోగదారుడు ఇతరుల సమాచారాన్ని తిరిగి పొందడానికి లేదా సవరించడానికి ఉద్దేశపూర్వకంగా కంప్యూటర్లను ఉపయోగించకూడదు, ఇందులో పాస్వర్డ్ సమాచారం, ఫైల్లు, మొదలైనవి ఉంటాయి,
Page Rating (Votes : 24)
Your rating: