• ఆన్లైన్ టాక్సీ అప్లికేషన్స్

స్మార్ట్ ఫోన్స్ మరియు ఇతర అప్స్ మన జీవితాల యొక్క మార్గాన్నే మార్చి వేసాయి. టాక్సీ బుకింగ్ అప్స్ ద్వార సంప్రదాయ టాక్సీ వ్యాపార పరిశ్రమ మందగించింది. ఉబర్, మెరు, ఓలా వంటి ప్రముఖ పేర్లు ప్రైవేటు రవాణా ప్రయోజనాలకు మార్గం చూపించాయి.

ఈ అప్స్ ఉపయోగించడానికి మన పేరు, మొబైల్ నంబర్ మరియు ఇ-మెయిల్ కలిగి ఉన్న మన వ్యక్తిగత సమాచారాన్ని అందించి అందులో రిజిష్టర్ చేసుకోవాలి. ఇది మహిళల గుర్తింపుకు ముప్పు కలిగించవచ్చు. ఒక టాక్సీ / క్యాబ్ ను బుక్ చేయాలనుకున్నప్పుడు మన మొబైల్ నంబర్ ను వారు అసైన్ చేయబడ్డ డ్రైవర్ కి షేర్ చేయబడుతుంది . ఆ డ్రైవర్ మీ మొబైల్ నంబర్ను దొంగిలించి, దుర్వినియోగం చేయవచ్చు.

  • ఎడ్యుకేషన్ అప్లికేషన్స్

తల్లులు వారి పిల్లలకు ఎల్లప్పుడూ ఉత్తమమైనది ఇవ్వడానికి చూస్తారు. కొన్ని ఎడ్యుకేషన్ అప్స్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అనుకూలంగా, కొన్ని త్వరలోనే కళాశాల గ్రాడ్యుయేట్స్ అయ్యే వారి కోసం తయారు చేయబడతాయి; కొన్ని మరింత సముచితమైన విద్యను అందించేవారి వారి కోసం తయారు చేయబడతాయి. ఎడ్యుకేషన్ అప్లికేషన్స్ తల్లులలో చాలా శ్రద్ధ ను కలిగిస్తున్నాయి. కానీ ఉత్తమమైన వాటిని గుర్తించడం అనేది మీరు అనుకున్నదానికంటే చాలా కష్టం.

చాలా అప్లికేషన్స్ ట్రయల్ పీరియడ్ లో సమాచారంతో కూడిన ఫ్రీ ట్రయల్ ఆఫర్స్ ని అందిస్తాయి. ఒకసారి ట్రయల్ పీరియడ్ ముగిసిన తర్వాత, అప్లికేషన్ ని కొనుగోలు చేసుకోవలసి వస్తుంది, కంటెంట్ నాణ్యత తగ్గుతుంది మరియు కస్టమర్కి డబ్బు కోల్పోయినట్లు మరియు మోసగించబడినట్లు అనిపిస్తుంది. కొన్ని నమ్మదగినవి అప్లికేషన్స్ గూగుల్ క్లాస్ రూమ్, క్లాస్ ట్రీ, బైజూస్ అప్, ఖాన్ అకాడమీ, ఎడమొడో మొదలైనవి.

  • బ్యాంకింగ్ అప్లికేషన్స్

బ్యాంకింగ్ అప్లికేషన్స్ అభివృద్ధితో, బ్యాంక్ ప్రక్రియ వేగవంతంగా మరియు మరింత నమ్మదగినదిగా మారింది. రికార్డు కీపింగ్ మరియు తిరిగి పొందడం చాలా సులభం అవుతుంది. వార్షిక, నెలవారీ మరియు రోజువారీ ప్రాతిపదికన వారి ఖర్చు అలవాట్లను వినియోగదారులు అర్థం చేసుకోవడానికి మరియు విశ్లేషించడానికి బ్యాంకింగ్ ఆప్స్ సహాయపడతాయి.

ఆన్లైన్ లావాదేవీలకు మరియు ఆన్ లైన్ షాపింగ్ చెల్లింపు కొరకు మహిళలు బ్యాంకింగ్ అప్లికేషన్స్ పై ఆధారపడుతున్నారు. దినిలో అన్ని సానుకూల లక్షణాలతో పాటు ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సైబర్ నేరస్తులు చట్టబద్ధమైన బ్యాంకు వెబ్సైట్లు పోలివున్న లోగోలు / పాఠాలు లావాదేవీలతో లింక్ను పంపవచ్చు. మీరు ఈ లింక్ల ద్వారా లావాదేవీలు చేసినప్పుడు, డబ్బు నేరుగా సైబర్ నేరస్తుల ఖాతాకు బదిలీ చేయబడుతుంది.

  • షాపింగ్ అప్లికేషన్లు

ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు ప్రస్తుతం మొబైల్ స్నేహపూర్వక అప్లికేషన్ల ను వినియోగదారులకు మరింత సులువుగా అందిస్తున్నాయి. ఆకర్షణీయమైన ఆఫర్లతో వివిధ షాపింగ్ అప్లికేషన్ల ప్రకటనలతో సోషల్ మీడియా ప్రవహిస్తుంది.

మహిళలు ప్రకటనలలో ప్రదర్శిస్తున్న ఉత్పత్తులకు ఆకర్షించబడతారు.వారు డౌన్లోడ్ చేసే ముందు ఈ అప్లికేషన్ల యొక్క ప్రైవసీ సెట్టింగ్స్ ను కూడా తనిఖీ చేయరు. ఇది మొబైల్ ఫోన్లలో నిల్వ చేయబడిన మీ వ్యక్తిగత సున్నితమైన సమాచారాన్ని రాజీ పడటానికి దారి తీస్తుంది. ఈ అప్లికేషన్స్ కొనుగోలు సమయంలో చూపించినదాని కంటే చౌకైన ఉత్పత్తులతో వినియోగదారుని మోసం చేయవచ్చు.

  • జాబ్ పోర్టల్స్

మీరు ఆన్లైన్ జాబ్ పోర్టల్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నఅన్నిఖాళీలు మరియు జాబ్స్ ని అందులో కనుగొంటారు. ఈ ఉద్యోగ పోర్టల్ ద్వారా మీ ఉద్యోగ దరఖాస్తును సమర్పించవచ్చు మరియు మీ అప్లికేషన్ వెంటనే వారికి అందుతుంది అని నిర్ధారన చేసుకోవచ్చు. కొన్ని ప్రఖ్యాత ఉద్యోగ పోర్టల్ అప్లికేషన్లు నౌకరీ, టైమ్స్ జాబ్స్, ఇండీడ్, షైన్ మొదలైనవి ఉన్నాయి.ముందు చెప్పినట్లుగా ఇవి మీ గుర్తింపుకు ముప్పుకు కూడా కారణం కావచ్చు.

గుర్తింపు దొంగలు ఉద్యోగ మార్పుల కోసం చూస్తున్న వ్యక్తులను కనుగొనడానికి ప్రముఖ ఉద్యోగ అప్లికేషన్ల ద్వారా స్కాన్ చేస్తారు. వారు మీ ఉద్యోగ శోధన యొక్క కీలకమైన అంశాలని సేకరిస్తారు మరియు మీకు నకిలీ ఉద్యోగాన్ని అందించే కాల్స్ ని ఆఫర్ చేస్తారు. వారు మీరు ఉద్యోగ పోర్టల్లో బ్రౌజ్ చేస్తున్న మీ కీలకమైన అంశాలకు సంబంధించిన ఉద్యోగాలను అందించి, మీ యొక్క నమ్మకాన్ని పొందుతారు.

  • చాటింగ్ / ఇన్స్టాంట్ మెసేజింగ్ అప్లికేషన్స్

ఈ రోజుల్లో ఇ-మెయిల్ / SMS / ఇన్స్టాంట్ మెసేజింగ్ (IM) అనేది మహిళలలో ప్రధాన సమాచార ప్రసార మాధ్యమాలు.   స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించకుండా ఉండడం ఎవరికైనా కష్టంగా ఉంది. మొబైల్ IM ఆప్స్ సంక్షిప్త సందేశ సేవ (SMS) ను అధిగమించాయి.

IM ఆప్స్ యొక్క యూజర్ ఫ్రెండ్నెస్ కారణంగా మహిళలు తక్షణ సందేశ ఆప్స్ ను ఉపయోగించుకుంటారు. దీనిని స్నేహితులకు/ కుటుంబానికి కాల్ చేయటానికి ఉపయోగించవచ్చు. ఇది గ్రూప్ చాట్స్ ను కూడా అనుమతిస్తుంది. ఇది మీకు అనేక మార్గాల్లో సహాయపడుతుంది అయినప్పటికీ అనేక భద్రతా సమస్యలు ఉన్నాయి. మీ ప్రొఫైల్ పిక్చర్ ని ఎవరైనా చూడవచ్చు మరియు ఉపయోగించవచ్చు. ఇది మీ గుర్తింపుకు ముప్పు కలిగించవచ్చు. WhatsApp, WeChat మరియు LINE అనేవి ఇన్స్టంట్ మెసేజ్ (IM) అప్లికేషన్స్ అందరూ విస్తృతంగా ఉపయోగిస్తారు.

  • ట్రావెల్ అండ్ హోటల్ బుకింగ్ యాప్స్

మీరు విమాన టికెట్లు లేదా హోటల్ టికెట్లను బుక్ చేసేటప్పుడు ప్రయాణ మరియు హోటల్ బుకింగ్ Apps అప్పుడప్పుడు మీకు కాంబో ఆఫర్లు ఇస్తారు. మీరు మొదటిసారి తమ అప్లికేషన్స్ ద్వారా టికెట్లను కోనుగోలు చేసినప్పుడు ప్రయాణ సంస్థలు డిస్కౌంట్ను అందిస్తాయి. ఇంకొక ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఈ ప్రయాణ అప్స్ ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న విమాన మరియు హోటల్ ఒప్పందాలను తరచూగా అప్స్ కు అందిస్తాయి. ఆఫర్లను చూసి చాలా మంది ప్రయాణ టిక్కెట్లను బుక్ చేసుకుంటారు మరియు వారి పేరు పైనా బుక్ చేసుకున్న టిక్కెట్ / హోటల్ లేనందున డబ్బు కోల్పోవటం జరుగుతుంది. మై ట్రిప్, త్రివగో, యాత్ర మరియు అగోడా తదితర ఆప్స్ కొన్ని నమ్మదగిన ఆప్స్ గా ఉన్నాయి.

 

Page Rating (Votes : 19)
Your rating: