అంతర్జాల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ఆన్ లైన్ను సరదాగా ఉపయోగించడానికి ఇది చాలా అవసరం – మీ మిత్రులతో కబుర్లు చెప్పుకోడానికి, మీరు తీసిన వీడియో గాని లేదా మీరు రాసిన పాటగాని పోస్టు చేయడానికి, మీకు ఆసక్తి ఉన్న సమాచారం మరింత తెలుసుకోవడానికి మరియు ప్రస్తుత ధోరణులను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది – ఈ సమయంలో మీరు వేధింపులకు, నిందలకు లేదా మోసాలకు గురికాకుండా, లేదా మీ గుర్తింపుతో పాటు ఆలోచనలను దొంగలించబడకుండా ఉండాలి.

అంతర్జాల భద్రత అంటే మీ కంప్యూటరులో తాజా వైరస్ నిరోదకాన్ని ఉంచి మరియు ఫైర్వాల్ సాఫ్ట్ వేర్ నెలకొల్పటం మాత్రమే కదు దానికంటే చాలా ఎక్కువ. ఆన్ లైన్ లో మిమ్మల్ని మీరు ఎలా సంబాలించుకుంటారో, ఇతరలతో ఎలా సమర్థవంతంగా వ్వవహరిస్తారో (ముఖ్యంగా ఆన్ లైన్ లో కలిసిన అపరిచితులతో) మరియు అమాయకంగా ఆన్ లైన్ లో మోసాలు చేసేవారి వలలో పటకుండా ఉండటం కూడా అంతర్జాల భద్రత కిందే వస్తుంది

ఆన్లైన్లో సురక్షితంగా ఉండటం ఎందుకు ముఖ్యం?

మనలో చాలా మంది ల్యాప్టాపులు, మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు లేదా వ్యక్తిగత కంప్యూటరుతో 'జత' (‘కనెక్టు’) అయి ఉంటాము. దీనిని అమూల్యమైన మరియు సరదా వినోదానికి, స్నేహాలు ఎర్పరచుకోవడానికి, అందరితో ఎప్పుడూ చేరువలో ఉండటానికి ఉపయోగించవచ్చు. వీటితో పాటు చాలా విశయాలను నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు భద్రత అవగాహన లేకుండా అంతర్జాలాన్ని ఉపయోగిస్తే, మీరు చట్టవిరుద్ధ కార్యకలాపాలు లేదా దుర్వినియోగంలో పడే ప్రమాదం ఉంది. - అది బెదిరింపులు, మోసాలు లేదా ఇంకేవో మరింత తీవ్రమైనవి కావచ్చు. నెట్ లో, ముఖాముఖిలా కాకుండా, మొదట కనిపించినట్లుగా ఎప్పుడూ ఉండరు.

మీరు ఇల్లు వదిలి ఉన్నప్పుడు ఎలాంటి భద్రతలు తీసుకుంటారో అదే విధంగా ఆల్ లైన్లో సురక్షితంగా ఉండడానికి విధమైన జాగ్రత్తలు తీసుకోవటం చాలా ముఖ్యం. కొన్ని నైపుణ్యాలు మీ జీవితాంతం మీతో కలిసి ఉంటాయి.

మీరు ఆన్ లైన్లో ఉన్నప్పుడు అనుసరించవలసిన కొన్ని విలువైన సూచనలు

  • మీ చిరునామా లేదా ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వవద్దు.
  • ఎవరికైనా మీ చిత్రాలు, ముఖ్యంగా అసభ్య చిత్రాలు, పంపవద్దు.
  • మీకు తెలియని వారి నుండి వచ్చిన ఇమెయిళ్ళను లేదా జోడింపులను తెరవవద్దు.
  • మీకు తెలియని వ్యక్తులకు ఆల్ లైన్ 'మిత్రులు' కాకండి.
  • మీకు ఆన్ లైన్లో పరిచయమైన వ్యక్తిని ఎప్పుడూ కలివడానికి ప్రయత్నించవద్దు.
  • ఆన్ లైన్లో ఆందోళన కలిగించేది ఏదైనా చూసినా లేదా చదివినా మీరు ఎవరకైనా చెప్పండి/మీ తల్లితండ్రులకు తెలియచేయండి.

ISEA-అవగాహన కార్యకమం యువకులు/విద్యార్థులకు ఆన్ లైన్ భద్రతకు సంబంధించిన చిట్కాలు మరియు సలహాలను ఇస్తుంది. అంతర్జాలాన్ని ఉపయోగించే ముందు ఈ మార్గదర్శకాలను/దశలను అనుసరించండి.

దశ 1: ఒక వెబ్ బ్రౌజర్ ఉపయోగించటం

స్నేహితులు మరియు కుటుంబంతో జతగా ఉండడానికి అంతర్జాలం ఒక మార్గం. చాలా మంది విద్యార్థులకు ఇది వార్తలు తెలుసుకోవడానికి, పరిశోధన సమాచారం పొందటానికి, ఆన్ లైన్ షాపింగుకు, పుస్తకాలను మరియు అనువర్తనాలను డౌన్ లోడ్ చేసుకోవడం మొ. వాటికి ఉపయోగ పడుతుంది. ఇప్పుడు బ్యాంకు వ్యవహారాలకు, బిల్లులు చెల్లించడానికి, దరఖాస్తులు మరియు పత్రాలను పూర్తిచేసి సమర్పించడానికి అంతర్జాలం ఒక ప్రసిద్ధ పద్ధతిగా మారింది.

ఆన్ లైన్ కోసం వెబ్ బ్రౌజరును ఉపయోగించటం సులభం. కానీ మీకు మీ కంప్యూటరుకు కొన్ని కనిపించని ప్రమాదాల ఉండవచ్చు. వైరస్లు, స్పైవేర్ మరియు యాడ్వేర్ కలిగిన మాల్వేర్ ద్వారా మీ సున్నితమైన వ్యక్తిగత సమాచారం బహిరంగం కావడం మరియు సంక్రమణకు దారితీసే ప్రమదం ఉంది. సురక్షత బ్రౌజింగ్ అంటే ఇలాంటి ఆన్ లైన్ ప్రమాదాలను తెలుసుకొని వాటిని నివారించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవటం అని అర్థం.

సురక్షితంగా అంతర్జాలాన్ని ఉపయోగించటానికి కొంచెం కృషి, కొన్ని ఉపకరణాలు మరియు కొంచెం ప్రాథమిక సమాచారం సరిపోతుంది. ఆన్ లైన్ లో మీ వ్యక్తిగత సమాచారాన్ని మరియు మీ కంప్యూటరును రక్షించుకునేందుకు కింది మార్గదర్శకాలను అనుసరించండి.

  • మీ కంప్యూటర్ లేదా పరికరంలో తాజా వైరస్ వ్యతిరేక సాఫ్ట్వేరును ఇన్స్టాల్ చేయండి మరియు నిర్వహించండి.
  • మీ అంతర్జాల బ్రౌజరును నవీకరించండి
  • మీ కంప్యూటర్ అసాధారణ కార్యకలాపాలు లేదా సమస్యల గురించి అప్రమత్తంగా ఉండండి.
  • మీ కంప్యూటర్లో ఫైర్వాలును ఇన్స్టాల్ చేయండి మరియు నిర్వహించండి.
  • పాప్ అప్ ప్రతిబంధకం(బ్లాకర్) ఉన్న ఆధునిక బ్రౌజరును ఉపయోగించండి.
  • మీ కంప్యూటర్లో సున్నిత వివరాలను నిరవధికంగా ఉంచటాన్ని మానుకోండి.
  • తరచుగా మీ పాస్ వర్డును మార్చండి.
  • తక్షణ సందేశం మరియు ఇ-మెయిల్ జోడింపులు ద్వారా పంపిన లింకులపట్ల జాగ్రత్త వహించండి.

దశ 2: 'స్నేహం' చేసుకోవటం

కంప్యూటర్ స్క్రీన్ ముందు గంటల సమయం కూర్చోవటం ఆరోగ్యకరమైనది కాదు అని మనందరికీ తెలుసు. కానీ సామాజిక నెట్వర్కింగులో మీకు ఎక్కువ మంది 'మిత్రులు' ఉన్నారని తెలియచేయటం ఒక సమస్యగా మారింది. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి:

  • ఆన్లైన్ స్నేహం మాట్లాడి అనుభవాలను పంచుకోవడం ద్వారా కాకుండా ఒక బటన్ క్లిక్ తో జరుగుతుంది.
  • ఒకరితో ఆన్లైన్ 'స్నేహం' నేరుగా కలిసి చేసిన స్నేహం కంటే తక్కువ అర్ధవంతమైనది.
  • ఆన్లైన్ 'స్నేహితులు' తో మీరు సులభంగా వేరు అవ్వొచ్చు. దీనికి కారణం ఎదురుగా ఉన్న వారికంటే ఎదురుగా లేని వారు మీ వాక్యలను అపార్థం చేసుకొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • ముఖా ముఖిగా మాట్లాడే వీలు ఉన్నప్పుడు వాదనలు మరియు సమస్యల నుంచి బయటపడటం చాలా సులభంగా మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది

అందువలన, ఇతరులు తమ మాసాజిక నెట్వర్కింగ్ సైట్లో ఎంతమందితో 'స్నేహం' చేసారో గొప్పగా చెప్పుకున్నా, నిజమైన స్నేహం కంప్యూటర్ల ద్వారా చేయలేరని మీరు గుర్తుంచుకోవాలి.

సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో సురక్షితంగా ఉండటానికి చిట్కాలు

  • మీకు వీటిలో చేరడానికి తగిన వయసు ఉన్నట్లు నిర్ధారించుకోండి
  • మీ ప్రొఫైల్ లో వేరే పేరు లేదా మారుపేరును ఉపయోగించండి.
  • వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ ఇవ్వకండి.
  • మీకు వ్యక్తిగతంగా తెలియని వారితో స్నేహం చేయవద్దు.
  • మీరు మీ ఆకృతి (ప్రొఫైల్) నిశ్చయం (సెట్టింగ్) చేసేటప్పుడు ‘బలమైన గోప్యత’ను ఎంచుకొండి. దీనీ వలన మీ స్నేహితులకు మాత్రమే మీ సమాచారాన్ని వీక్షించడానికి అవకాశం ఉంటుంది.
  • చిత్రాలు మరియు వీడియోలను అంతర్జాలంలో అప్లోడ్ చేయటం చాలా సులువు, ఇలా చేసే టప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి – వీటిని మీరు మీ స్నేహితులతో మాత్రమే పంచుకున్నా కాని అవి సులభంగా మరింత ఎక్కువగా వ్యాప్తి కావచ్చు
  • సమాచారాన్ని ఆన్ లైన్ లో పంచుకొనే టప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి –ప్రత్యేకంగా అది మీది కానప్పుడు. అక్రమ డౌన్లోడులకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి.

దశ 3: స్మార్ట్ఫోన్ భద్రత

ఈ కాలంలో మనం స్నేహితులు లేదా కుటుంబం సభ్యులతో మాట్లడటానికి కేవలం ఫోన్లపై ఆధారపడిలేము. ఆధునిక స్మార్ట్ఫోన్ల తో మనం అనేక పనులు చేయవచ్చు; అంతర్జాల బ్రౌజింగ్, మీ బ్యాంకు ఖాతా వాంగ్మూలాల తనిఖీ, పనికి సంబంధించిన ఇమెయిల్లు చూడటం, మీ బిల్లులు చెల్లించడం లాంటివి ఎన్నో చేయవచ్చు. స్మార్ట్ఫోన్లు చాలా ముందున్నాయి కాబట్టి కంప్యూటర్ల ద్వారా వచ్చే భద్రతా పరమైన సమస్యలు ఇప్పుడు మన స్మార్ట్ఫోన్లలో కూడా ఉనికిలోకి వచ్చాయి.

దీని వలన ఎలాంటి ప్రమాదం కలుగుతుది?

  • పరికరం పాడవటం లేదా దొంగతనం జరగటం: పరికరం ప్రమాదానికి గరైనా లేదా దొంగతనానికి గురైనా అది ఉత్పాదకత నష్టం, సమాచార నష్టం, మరియు డేటా రక్షణ చట్టాలు కింద తగిన బాధ్యతకు కారణమవుతుంది.
  • సున్నితమైన సమాచారాన్ని కోల్పోవడం: చాలా మొబైల్ పరికరాలు, ఉదాహరణకు, ఛాయాచిత్రాలు, వీడియోలు, ఇమెయిల్ సందేశాలు, టెక్స్ట్ సందేశాలు మరియు ఫైళ్ల లాంటి సున్నితమైన లేదా రహస్య సమాచారాన్ని కలిగి ఉండవచ్చు.
  • అనధికార నెట్వర్క్ వ్యాప్తి: అనేక మొబైల్ సాధనాలు వివిధ నెట్వర్క్ సంధాయకత (కనెక్టివిటీ) ఎంపికలను అందించే అవకాశం ఉండటం వలన, వాటిని రక్షిత కార్పొరేట్ వ్యవస్థలపై దాడికి చేసేందుకు వాడే అవకాశం ఉంది.
  • అడ్డుకున్న లేదా పాడైన సమాచారం: చాలా వ్యాపార లావాదేవీలు మొబైల్ పరికరాల ద్వారా జరుగుతుండటంతో, ముఖ్యమైన సమాచారాన్ని ఫోన్ లైన్ల ద్వారాగాని లేదా అడ్డగించిన మైక్రోవేవ్ ప్రసారాలు ద్వారాగాని అడ్డుకుంటారనే భయం ఎల్లప్పుడు ఉంటుంది.
  • హానికరమైన సాఫ్ట్వేరు: వైరస్లు, ట్రోజన్ హార్సులు, మరియు వార్ములు మొబైల్ పరికరాలకు తెలిసిన ప్రమాదాలు. ఇది ఒక ముఖ్యమైన లక్ష్యంగా మారింది.

నేను దీనిని జరగకుండా ఎలా నివారించవచ్చు?

  • ఒక మొబైల్ పరికరాన్ని ఎంచుకోనే ముందు దాని భద్రతా లక్షణాలను పరిగణలోకి తీసుకోవాలి మరియు వాటిని ఎనేబుల్ చేయండి.
  • మీ స్మార్ట్ పరికరంలో వైరస్ వ్యతిరేక అనువర్తనాన్ని (అప్లికేషన్) ఇన్స్టాల్ చేసి నిర్వహించండి.
  • అనుమానాస్పద ఇమెయిల్ లేదా టెక్స్ట్ సందేశాలలో పంపిన లింకులను తెరవవద్దు.
  • మీ మొబైల్ పరికరంలో ఏ సమాచారాన్ని నిల్వ ఉంచాలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొండి
  • అనువర్తనాన్ని ఎంచుకోవడం మరియు ఇన్స్టాల్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి
    బ్లూటూత్, ఇంఫ్రారెడ్, లేదా Wi-Fi లాంటి ఇంటర్ఫేసులు వినియోగంలో లేనప్పుడు నిలిపివేయండి.
  • బ్లూటూత్, ఇంఫ్రారెడ్, లేదా Wi-Fi లాంటి ఇంటర్ఫేసులు వినియోగంలో లేనప్పుడు నిలిపివేయండి.
  • పరికరాన్ని పారేసే ముందు దానిలో నిల్వ ఉన్న సమాచారాన్ని తొలగించండి.
  •  
Page Rating (Votes : 43)
Your rating: