సమాచార అవస్థాపన మరియు అంతర్జాలం మరింత జటిలం మరియు పెద్దగా అవటం వలన, వ్యవస్థలను భద్రతా పరంగా అన్ని సమయాలలో నిర్వహించడం మరియు నడపటం సంక్లిష్టంగా మారింది. వ్యవస్థ పరిపాలన (సిస్టం అడ్మినిస్ట్రేషన్) పనులు ఇటీవలి కాలంలో సులభతరంగా మారినా, వ్యవస్థ నిర్వహణాధికారులు, వాటిని నిర్వహిస్తున్నందు వలన, వ్యవస్థలు మరియు నెట్వర్క్ భద్రతలకు సంబంధించి నవీకరించుకోవటం మరింత అవసరం. ఇటీవలి కాలంలో, అన్ని వ్యవస్థలను అంతర్జాలంలో పెడుతున్నారు; వీటి నిర్వహణ మరియు వీటిని దాడుల నుండి రక్షించటం వ్యవస్థ నిర్వహణ/నెట్వర్క్ నిర్వహణకు సవాలుగా మారింది.
సంస్థలో వ్యవస్థలు/కంప్యూటర్లు/నెట్వర్క్ పరికరాలు సజావుగా మరియు సురక్షితంగా పని చేసేలా చూడటం వ్వవస్థ నిర్వాహణాధికారుల ప్రధాన బాధ్యత. ఇంకా వివియోగదారు వ్యాపార అవసరాలకు సరిపోయేలా నెట్వర్కులు మరియు కంప్యూటర్లు నిరంతర పనిచేసేలా చూడటం కూడా వీరి బాధ్యతే. సంస్థలోని వ్యవస్థ మరియు నెట్వర్కు పరికరాల సంరక్షణకు సంబంధిచిన సమాచారాన్ని కలిగి ఉండటం వ్యవస్థ నిర్వహణాధికారికి చాలా ముఖ్యం.
పరిపాలనా విధుల సమయంలో సాధారణ పద్ధతులు/ప్రమాణాలు పాటించి, వారు IT పరికరాల భద్రతను సాదించగలరు. భద్రతా పద్ధతులను పాటించటం వలన మొదట్లోనే భద్రతా సంఘటనల నివేదికను తయారు చేయవచ్చు తద్వారా సురక్షితంగా వ్యాపార కాలాపాలు జరిగేలా దిద్దుబాటు చర్యలు తీసుకోవావటం సాధ్యమవుతుంది. అవగాహనలో భాగంగా, ISEA రెండో దశ వ్యవస్థలు మరియు నెట్వర్క్ పరికరాల కోసం ఉత్తమ విధానాలను మరియు మార్గదర్శకాలు పరిచయం చేస్తుంది.
వ్యవస్థ నిర్వాహణాధికారులు మరింత జాగ్రత్త వహించి రోజువారీ పరిపాలనా పనులలో సరైన పద్ధతులను అనుసరిస్తే, సంస్థలోని ఐటి వ్యవస్థల నెట్వర్కులను సురక్షితంగా నిర్వహించడం తేలిక అవుతుంది. వ్యవస్థ నిర్వహణ, సంస్థ విధానాలను అనుసరించి, తన సొంత విధానాన్ని కలిగి ఉండాలి:
- సంస్థ విధానం ప్రకారం వ్యవస్థ చెక్కుచెదరకుండా నిర్వహణ చేయాలి
- వినియోగదారులకు అగకుండా మద్దతు ఇవ్వాలి
- ప్రతి సంస్థ తన దిశలను నిర్దారించే మరియు భద్రతా లక్ష్యాన్ని పూర్తిచేసే అలాగే దాని పాత్ర మరియు బాధ్యతలను తెలియచేసే మొత్తం విధానాన్ని కలిగి ఉండాలి.
- ప్రత్యేక వ్యవస్థలు, నెట్వర్కులు మరియు అనువర్తనాల (అప్లికేషన్ల) భద్రతా విధానాల కోసం వ్యవస్థ ఆధారిత నియమాలు కూడా ఉండాలి.
- ఈ విధానాలు ఉద్యోగి హ్యాండు బుక్కులో చేర్చాలి మరియు కంపెనీ ఇంట్రానెట్ సైట్లో ఉంచాలి.
- వ్యవస్థలను మరియు నెట్వర్కు పరికరాలను పని ప్రదేశంలో లేదా ఇప్పటికే ఉన్న నెట్వర్కులలో ఉంచే ముందు, కొన్ని ఉత్తమ వ్యవస్థ/నెట్వర్క్ పద్ధతులు అనుసరించడం చాలా ముఖ్యం
- నెట్వర్క్ లో ఉంచే ముందు ఆపరేటింగ్ వ్యవస్థను (సిస్టం) హార్డెన్ చేయండి
- ఏకీకృత (ఇంటిగ్రేటెడ్) OSను మరియు దానిలో సంస్తాపించిన (ఇన్స్టాల్) అప్లికేషన్ను హార్డెన్ చేయండి
- మొత్తం నెట్వర్క్ నిర్మాణాన్ని ఒకే దగ్గర కలిగి ఉండండి
- దాడి నిర్ధారణ విధానాన్ని ఉపయోగించి ఓపెన్ పోర్టులు మరియు ఏదైనా దాడికి గురయ్యే అనువర్తనాల నెట్వర్కును హార్డెన్ చేయండి
- నిజానికి అవసరమైన కనీస సేవలు అమలులో ఉంచి సర్వర్లను హార్డెన్ చేయండి
- వ్యవస్థలు మరియు నెట్వర్కుల భద్రతా లొసుగులకు సంబంధించిన జ్ఞానాన్ని ఎల్లప్పుడూ పెంపొందించుకొండి
- నెట్వర్కుకు జత చేసిన ఇంటర్నెట్వర్కింగ్ పరికరాలకు భౌతిక భద్రత ఎల్లప్పుడూ కల్పించండి
- వ్యవస్థలు/నెట్వర్కుల కాన్ఫిగరేషన్ మరియు ఎప్పుడు మార్పులు జరిగినా వాటిని ఎల్లప్పుడూ నమోదు (డాక్యుమెంట్) చేయండి
- వ్యవస్థ/నెట్వర్క్ లాగ్ లను దిగుమతి (డౌన్లోడ్) చేసుకొని క్రమానుగతంగా మీ వ్యవస్థను పర్యవేక్షించండి
- వినియోగదారులకు మరియు సహాయ డెస్క్ సిబ్బందికి ప్రాథమిక భద్రతా సమస్యలు మరియు అనుసరించ వలసిన పద్ధతుల గురించి అవగాహనను వ్యవస్థ పరిపాలనాధికారి మరియు నెట్వర్క్ అడ్మిన్ కల్పించటం అవసరం