ప్రాథమిక స్థాయి

డేటా మరియు సమాచారము గురించి

డేటా అంటే ఏమిటి?

డేటా అనేది, ప్రక్రియ జరపవలసియున్న మొరటు, అసంఘటిత వాస్తవాలు.  డేటా అనేది సంఘటితపరచేవరకూ  కొంత సులువైనది మరియు యాదృచ్ఛికం అనిపించేది మరియు ఉపయోగం లేనిది.

ఉదాహరణ:

  1. ఒక విద్యార్థి యొక్క పరీక్ష స్కోరు లేదా మార్కులు డేటాలో ఒక భాగం.
  2. అస్వస్థుడైన ఒక వ్యక్తి యొక్క రెండు రోజుల ఉష్ణోగ్రత రీడింగులు అనేది డేటా. ఒకవేళ ఈ డేటాను సంఘటితపరచి రోగి నిర్దిష్ట వ్యాధిచే ప్రభావితం అయినట్లుగా కనుక్కోవడానికి విశ్లేషణ చేస్తే, అప్పుడు అది సమాచారం అవుతుంది.

సమాచారము అంటే ఏమిటి?

డేటాను ఒక ప్రక్రియ లో విశ్లేషించి, సంఘటితం చేసి, ఇవ్వబడిన సందర్భానికి ఉపయోగకరంగా ఉండేలా తగ్గట్టుగా మలచి సమర్పించగలిగితే, దానిని సమాచారం అంటారు.

ఉదాహరణ:

  1. 10 వ తరగతి పరీక్షలలో రాజు 80 % తెచ్చుకున్నాడనేది రాజు గురించిన ఒక సమాచారం.
  2. ఒక వెబ్‌సైట్ కు సందర్శకుల సంఖ్య అనేది డేటాకు ఒక ఉదాహరణ. ఒక నిర్దిష్ట ప్రాంతము నుండి ఎంతమంది వ్యక్తులు వెబ్‌సైట్ ని అందుబాటు చేసుకుంటున్నారు అనేది అర్థవంతమైన సమాచారం.

మనం మన డేటా లేదా సమాచారమును ఎందుకు సురక్షితం చేసుకోవాల్సి ఉంటుంది?

సమాచారము యొక్క అనధీకృత అందుబాటు, వాడకము, వెల్లడి, మార్పుచేర్పులు మరియు తనిఖీని నివారించడానికి "సమాచార భద్రత" లేదా "డేటా భద్రత" అనేది అవసరము.

డేటా లేదా సమాచార భద్రత ఎలా సైబర్ భద్రతకు సంబంధించినది అవుతుంది?

ఏ వ్యక్తికైనా , అతని/ఆమె పేరు, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు మొ., అతని/ఆమె యొక్క వ్యక్తిగత డేటా, వ్యక్తిగత సమాచారము అని కూడా పిలువబడే వ్యక్తిగత డేటా, దీనిని  వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారము (పిఐఐ) , లేదా కీలకమైన  వ్యక్తిగత సమాచారము (ఎస్‌పిఐ) అని అంటారు. ఈ కీలకమైన వయక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు దొంగిలించి దురపయోగించవచ్చు.

డిజిటల్ వాడుకదారులుగా మనం మన వ్యక్తిగత డేటా మరియు వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారము (పిఐఐ) ను మన ఇమెయిల్ ఐడి లు, బ్యాంక్ ఖాతాలు, సోషల్ మీడియా ఖాతాలను అందుబాటులోతెచ్చుకుని వాడడానికి   ఉపయోగిస్తాము , డిజిటల్ చెల్లింపులు చేయడం మరియు వివిధ ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవడానికి కూడా ఉపయోగించుకుంటాము.  ఇది మన వ్యక్తిగత డేటాను నేరగాళ్లు దుర్వినియోగించటానికి వీలు కల్పిస్తుంది  మరియు నేరస్థులచే సైబర్ దాడికి గురయ్యేలా చేస్తుంది. ఈ దోపిడీ ఆర్థిక నష్టం, డేటా నష్టం, సిస్టమ్/ఖాతాల హ్యాకింగ్, తప్పుడు తెలియజేత, మాల్‌వేర్/ స్పైవేర్/ ర్యాన్సమ్ వేర్ దాడులు మొదలగు వంటి వివిధ సమస్యలను కలిగించగలుగుతుంది., అందువల్ల మన వ్యక్తిగత మరియు సున్నితమైన/కీలకమైన డేటా లేదా సమాచారమును సురక్షితంగా ఉంచుకోవడం అవసరము.

ఉదాహరణ: నకిలీ ప్రొఫైల్స్/పత్రాలను సృష్టించడానికి వ్యక్తిగత డేటాను తారుమారు చేయవచ్చు మరియు ఉపయోగించవచ్చు.

సమాచార భద్రత లేదా సైబర్ భద్రత అనేది అనధికారిక ప్రాప్యత నుండి సమాచారాన్ని రక్షించుకోవడం గురించి తెలియచేస్తుంది. మరియు అనధికారిక ప్రాప్యత, వాడకము, వెల్లడి, అవకతవక, మార్పుచేర్పులు, తనిఖీ, రికార్డింగ్ లేదా సమాచార వినాశనాన్ని నివారించడం గురించి కూడా తెలియచేస్తుంది.

గోప్యత, సమగ్రత మరియు లభ్యత (సిఐఎ) యొక్క పరిరక్షణ సమాచార భద్రత లేదా సైబర్ భద్రత యొక్క ప్రాథమిక లక్ష్యముగా ఉంటుంది.

డేటా లేదా సమాచారమును మనం ఎలా పరిరక్షించుకోవచ్చు?

వ్యక్తుల కొరకు డేటా/సమాచార పరిరక్షణ చిట్కాలు

ఏ వ్యక్తి అయినా  కూడా ఫిషింగ్ ఇమెయిల్స్, సోషల్ ఇంజనీరింగ్, మరియు సోషల్ మీడియా బెదిరింపుల వంటి నేరపూరితమైన సైబర్ దాడులకు గురి కావచ్చు.  సైబర్-నేరస్థునిచే పంపించబడిన లింక్ పై చేసే ఒకే ఒక్క క్లిక్ సున్నితమైన/కీలకమైన  డేటా నష్టానికి లేదా గుర్తింపు చోరీకి దారి తీయవచ్చు.

మీ వ్యక్తిగత డేటాను సైబర్ సురక్షితంగా ఉంచుకొని సురక్షితంగా ఉండేందుకు ఇక్కడ కొన్ని మార్గాలు ఇవ్వబడినవి:

తెలియని లింక్ ల జోలికి వెళ్ళవద్దు: ఇమెయిల్ పంపించినవారు లేదా వెబ్‌సైట్ మీకు అనుమానితులుగా కనిపించక పోయినప్పటికీ  తెలియని లింక్ లపై ఎప్పటికీ క్లిక్ చేయవద్దు.

విభిన్న పాస్‌వర్డ్‌లను సృష్టించుకొనండి: మీ ఖాతాలకు లేదా ఆన్లైన్ అకౌంట్లకు   ధృఢమైన మరియు వేర్వేరు పాస్‌వర్డులను ఉపయోగించండి. వివిధ ఖాతాలపై ఒకే పాస్‌వర్డును ఉపయోగించడం సామాన్యంగా జరిగే విషయం, అది కేవలం ఒక్క ఖాతాకే కాక అన్ని ఖాతాలకూ సైబర్-నేరస్థులు ప్రాప్యత పొందడానికి సులభమైన మార్గం అవుతుంది.

మీ వక్తిగత సమాచారాన్నిబహిరంగంగా   పంచుకోవద్దు లేదా నిల్వ చేయవద్దు: మీ వ్యక్తిగత సమాచారమును ఎప్పటికీ మీ ఇమెయిల్ ఖాతాలో నిల్వ చేయవద్దు లేదా పిఐఐ ని ఇమెయిల్, సందేశాలు లేదా ఆన్‌లైన్ అప్లికేషన్లలో పంపించవద్దు.

అతిచిన్న అక్షరాలలో ఉండే ముద్రణను చదవండి: వ్యక్తిగత సమాచారమును ఏదైనా వెబ్‌సైట్ కు ఇచ్చే ముందుగా, ప్రత్యేకించి ఆన్‌లైన్ కొనుగోళ్ళను చేయునప్పుడు అతిచిన్న అక్షరాలలో ఉండే ముద్రణను చదవండి.

అనవసరమైన అనుమతులను మరియు  ప్రాప్యతను నివారించండి: మీ మొబైల్ ఫోన్ పై వివిధ అప్లికేషన్లను ఇన్‌స్టాల్ చేసుకునే ముందుగా వాటికి  రిమోట్ అనుమతులను మరియు ప్రాప్యతను ఇవ్వడం నివారించుకోండి.

ఆన్‌లైన్ జాగ్రత్తలు: మీ  ఉన్న  ప్రదేశము/ స్థానం  మరియు ఇమెయిల్ చిరునామాతో సహా ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ నెట్‌వర్కింగ్ వేదికలలో పంచుకోవడాన్ని పరిమితం చేయండి.

అధునాతన స్థాయి

సంస్థల కొరకు డేటా/సమాచార పరిరక్షణ చిట్కాలు:

కొత్త కొత్త అవాంతరాలు/ ఆన్లైన్ దాడులు పుట్టుకొస్తూ ఉండడం వల్ల, ఉద్యోగులతో సహా సంస్థలు అన్నీ వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారము (పిఐఐ)ను రక్షించుకోవడానికి కొన్ని నిర్దిష్ట పద్ధతులను పాటించడానికి ఇదే సరైన సమయం.

మీ సిస్టములు మరియు సాఫ్ట్ వేర్ ని అప్‌డేట్ చేసుకోండి: అత్యంత తాజా ఆపరేటింగ్ సిస్టమ్ మరియు అదనపు సాఫ్ట్ వేర్ అప్‌డేట్లతో అత్యంత అప్డేటెడ్ గా  ఉండండి.

ఎన్‌క్రిప్షన్: ఉద్యోగులు, భాగస్థులు/భాస్వామ్యులు  మరియు కస్టమర్లచే పంచుకోబడిన గోప్యతా సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేయండి.

పాస్‌వర్డ్ సృష్టించుకొనుట: ప్రతి కొన్ని నెలలకు ఒకసారి పాస్‌వర్డులను క్రమం తప్పకుండా మాబయటి కనెక్షన్లు తీసుకోవద్దు: ఒక ఉపకరణం నుండి మరొకదానికి డేటాను బదిలీ చేయడానికి వాడే యుఎస్‌బి లు మరియు ఇతర బాహ్య ఉపకరణాలను మీ ఆఫీస్ సిస్టముపై వాడటం మానండి.  మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఛార్జ్ చేయడానికి వాడే యుఎస్‌బి పోర్టులకు కూడా ఇది వర్తిస్తుంది.రుస్తూ ధృడమైన  పాస్‌వర్డ్ వాడకమును అమలు చేయండి.

డేటా బ్యాకప్ మరియు రికవరీ: మీరు ఎప్పటికప్పుడు ఆధునీకరించబడే గట్టి డేటా బ్యాకప్ మరియు రికవరీ పద్ధతిని కలిగి ఉండడానికై మీ సమాచార భద్రతా కార్యనిర్వాహకులను సంప్రదించండి.

Page Rating (Votes : 19)
Your rating: