ప్రతిఒక్కరికీ Wi-Fi రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారింది. ఇంటర్నెట్ వినియోగదారులలో ప్రత్యేకంగా మహిళలు వారి నివాసము షాపింగ్ మరియు బ్యాంకు కొరకు, ఇంటర్నెట్ ను యాక్సెస్ చేసేందుకు Wi-Fi పరికరాలపై ఆధారపడి ఉంటారు, సమన్వయ జీవితానికి Wi-Fi తో కనెక్ట్ చేయబడి ఉంటారు. సురక్షితమైన Wi-Fi కనెక్షన్ అనేది మన వ్యక్తిగత డేటాను సురక్షితం చేయడానికి ఒక ముఖ్యమైన అంశం. కొన్ని వైర్లెస్ పరికరములు వారి అప్రమేయ ఆకృతీకరణ రీతిలో బలహీనంగా ఉంటాయి. తుది వినియోగదారులు ప్రత్యేకించి మహిళలు ఈ పరికరాల్లో భద్రతా స్థాయిలను పూర్తిగా తెలుసుకోలేరు కాబట్టి అవి సైబర్ ముప్పుకు సులభంగా గురవుతాయి. సైబర్ నేరస్తులు వారి చట్టవిరుద్ధ ప్రయోజనాలను పొందడానికి ఈ అసురక్షిత Wi-Fi పరికరాల కోసం చూస్తారు.
వైఫై కనెక్టివిటీ ద్వారా కంప్యూటర్, ల్యాప్టాప్ లేదా మొబైల్ ను కనెక్ట్ చేసుకున్న ఎవరైనా అసురక్షిత యాక్సెస్ పాయింట్స్ (వైర్లెస్ రౌటర్స్) కు అనుసంధానించవచ్చు. అలాగే డిఫాల్ట్ సెట్టింగులతో యాక్సెస్ పాయింట్ కాన్ఫిగర్ చేయబడినా లేదా అసురక్షితమైనదైనా, ఆ పరిధిలో ఉన్న ఎవరైనా దానిని నేరుగా కనెక్ట్ కావచ్చు. ఒక సారి అసురక్షిత నెట్వర్క్ ని ఉపయోగించి కనెక్ట్ అయిన తర్వాత, అటాకర్ మెయిల్లు, క్లాసిఫైడ్ / గోప్యమైన అంశాలను పంపవచ్చు, నెట్వర్క్ లో ఇతర కంప్యూటర్లపై దాడి చేయడం, ఇతరులకు హానికరమైన కోడ్ ను పంపడం, దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందడానికి బాధితుల కంప్యూటర్ లో ట్రోజన్ లేదా బోట్నెట్ ను ఇంస్టాల్ చేస్తారు.
ఉచిత Wi-Fi హాట్ స్పాట్ సైబర్ దాడులకు గురవుతుంది
మహిళల్లో చాలా మంది బహిరంగ ప్రదేశాల్లో వారి అభిమాన సోషల్ మీడియాను వీక్షించడానికి లేదా చాటింగ్ అప్లికేషన్లను ఉపయోగించడానికి కి ఉచిత వైఫై ని కనెక్ట్ చేస్తారు. రైల్వే స్టేషన్లు మరియు విమానాశ్రయాలలో పబ్లిక్ వైర్లెస్ కంప్యూటర్ నెట్వర్క్ లో ఇంటర్నెట్ ను ఉపయోగించడము వలన మీరు సైబర్ దాడులకు గురవుతారు. దోపిడీ చేసేవారు ఒకవేళ విజయవంతముగ కనెక్ట్ అయితే వీరు క్రెడిట్ కార్డ్ నంబర్లు, పాస్వర్డ్లు, చాట్ సందేశాలు, ఇమెయిల్స్ మొదలైన సున్నితమైన సమాచారాన్నిపొందేందుకు వీలు కల్పిస్తుంది. వినియోగదారులు పబ్లిక్ Wi-Fi కి బదులుగా భద్రమైన నెట్వర్క్లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ఉచిత పబ్లిక్ Wi-Fi ని ఉపయోగించేటప్పుడు గమనించవలసిన కొన్ని చిట్కాలు
- బహిరంగ ప్రదేశాల్లో ఓపెన్ Wi-Fi నెట్వర్క్లను ఆటో-కనెక్ట్ చేయవద్దు
- పబ్లిక్ Wi-Fi ని ఉపయోగిస్తున్నప్పుడు సురక్షితమైన వెబ్ సైట్లను మాత్రమే వీక్షించడండి.
- డేటాను పంచుకోవడాన్ని నిలిపివేయాలి
- మీకు అవసరం లేనప్పుడు Wi-Fi ని నిలిపివేయండి.
- సున్నితమైన పాస్వర్డ్లను ఉపయోగించడం మానుకోండ.
ఒక వ్యక్తిని ట్రాకింగ్ చేయటం
మొబైల్ ఫోన్ల మాదిరిగా, Wi-Fi పరికరాలకు ప్రత్యేకమైన ఐడెంటిఫైర్లు ఉంటాయి, ఇవి ట్రాకింగ్ ప్రయోజనాల కోసం ఉపయోగించబడతాయి, ఇది సమర్థవంతమైన భద్రతా సమస్యలకు కారణం కావచ్చు. Wi-Fi హాట్ స్పాట్ ను ఉపయోగించడం ద్వారా సైబర్ నేరాలకు దారి తీస్తుంది. సేవలను స్వీకరించడానికి లేదా ఉపయోగించడానికి, తరచూ వెబ్ సైట్ లు వినియోగదారు పేరు, వయస్సు, జిప్ కోడ్ లేదా వ్యక్తిగత ప్రాధాన్యతల వంటి వారి వ్యక్తిగత సమాచారాన్నిఅందించాలి.
అధికారులు:
అధికారులకు ప్రజల బ్రౌజింగ్ వివరాలు మరియు అలవాట్లు సులభంగా లభిస్తాయి, మరియు జాతీయ భద్రత పేరుతో ప్రజలను వారి అనుమతి లేకుండా పర్యవేక్షించడానికి ఉపయోగించవచ్చు.
హ్యాకర్లు:
సమాచారాన్ని దొంగిలించడానికి, సందేహించని బాధితుల బ్యాంకు ఖాతాలకు హ్యక్ చేసి, కార్పొరేట్ ఆర్ధిక సమాచారం మరియు రహస్యాలను దుర్వినియోగం చేస్తారు.
వైర్లెస్ కమ్యూనికేషన్ కోసం రౌటర్ ను కాన్ఫిగర్ చేసేటప్పుడు మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి కొన్ని చర్యలు
- డిఫాల్ట్ యూజర్ పేరు మరియు యాక్సెస్ పాయింట్ యొక్క పాస్ వర్డ్ ను మార్చండి.
Wi-Fi హోమ్ నెట్వర్క్ లు మరియు బ్రాడ్బ్యాండ్ రౌటర్ లు వినియోగదారుని పేరు మరియు పాస్వర్డ్ తో రక్షించబడుతాయి, తద్వారా అధికారం ఉన్న వ్యక్తులు నెట్వర్క్ కు నిర్వాహక మార్పులు చేయగలరు
- డిఫాల్ట్ SSID ను మార్చండి మరియు మీ నెట్వర్క్ పేరుని ప్రసారం చేయకుండా ఉండండి
యాక్సెస్ పాయింట్లు మరియు రౌటర్లు అన్ని సర్వీస్ సెట్ ఐడెంటిఫైయర్ అనే నెట్వర్క్ పేరును ఉపయోగిస్తాయి. కేవలము SSID తెలుసుకోవడం ద్వారా మీ నెట్వర్క్ దాడి చేయడం సాధ్యం కాదు కానీ అది పేలవంగా ఆకృతీకరించినట్లు చూపిస్తుంది.
- ఉపయోగంలో లేనప్పుడు Wi-Fi ని నిలిపివేయండి
మీరు మీ హోమ్ నెట్వర్క్ ను ఉపయోగించకుండా విరామం తీసుకున్నప్పుడు, దుర్వినియోగాన్ని నివారించడానికి స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. ఉపయోగంలో లేనప్పుడు యాక్సెస్ పాయింట్ను కూడా నిలిపివేయండి.
- ఇంటి Wi-Fi కోసం డైనమిక్ IP చిరునామాని ఉపయోగించకుండా స్టాటిక్ IP చిరునామాలను ఉపయోగించండి
చాలామంది హోమ్ నెట్వర్క్ నిర్వాహకులు వారి పరికరాలకు IP చిరునామాలను కేటాయించడానికి డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ (DHCP) ను ఉపయోగిస్తారు. DHCP ను రూటర్ లేదా ప్రాప్యత పాయింట్ పై ఆపివేసి, బదులుగా ఒక స్థిర ప్రైవేట్ IP చిరునామా శ్రేణిని సెట్ చేసి ఆపై పరిధిలోని చిరునామాతో ప్రతి పరికరాన్ని కాన్ఫిగర్ చేయండి.
- ఎన్క్రిప్షన్ కోసం ఎల్లప్పుడూ బలమైన పాస్వర్డ్ ను ఉపయోగించండి
పాస్వర్డ్లను వ్యక్తిగత డేటా నుండి ఉపయోగించడం మానుకోండి. గుర్తుంచుకోవడానికి సులభంగా ఉండే పదాలను వాడండి.
- Wi-Fi పరికరాల్లో MAC చిరునామా ఫిల్టరింగ్ను ను ప్రారంభించండి
MAC చిరునామాలతో కనెక్ట్ అయిన అన్ని పరికరాలను యాక్సెస్ పాయింట్లు మరియు రౌటర్లు తో ట్రాక్ చేయవచ్చు.
- అదనపు రక్షణ కొరకు ఫైర్వాల్ మరియు యాంటీవైరస్ ను ఉపయోగించండి
ఫైర్వాల్ మరియు యాంటీవైరస్ గేట్ వేతో వైర్లెస్ నెట్వర్క్ నుండి వైర్డు నెట్వర్క్ ను వేరుచేయండి.
- పరికరాల ద్వారా అందించిన డిఫాల్ట్ భద్రతా లక్షణాలను ఉపయోగించండి
అన్ని వైఫై పరికరాలు కొన్ని రకాల ఎన్క్రిప్షన్ కు మద్దతిస్తాయి. కాబట్టి, వాటిని ఎనేబుల్ చేయండి. క్రమంగా ఫర్మువేర్ ని అప్డేట్ చేయండి. వైర్లెస్ నెట్వర్కులలో సున్నితమైన డేటాకు ఎన్క్రిప్షన్ టెక్నాలజీని ఉపయోగించండి. ఎల్లప్పుడూ ఎన్క్రిప్షన్ కొరకుయాక్సెస్ పాయింట్ మద్దతు కొరకు గరిష్ట కీ పరిమాణన్ని ఉపయోగించండి
- అవసరమైనప్పుడు మాత్రమే ఫైల్ భాగస్వామ్య మరియు ఎయిర్ డ్రాప్ ఎంపికలను ప్రారంభించండి.
ఇంటర్నెట్ భద్రతా సమస్యలు మరియు ప్రజా Wi-Fi ప్రమాదాలు పెరుగుతున్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడము వలన మీ సమాచారాన్ని సురక్షితంగా ఉంచకోవచ్చు.