పరిచయం
భారతదేశం, దాని ప్రధాన జనాభా సామాజిక మీడియా తో కట్టిపడేశాయి, రోజువారీ అవసరాలు కోసం ఇంటర్నెట్ను ఉపయోగించే మహిళలు పెరుగుతున్నారు. అనుసంధానమైన కమ్యూనిటీలో అనేకమంది మహిళలు ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ లావాదేవీలు, సోషల్ మీడియా, ప్రయాణ సహాయం, సందేశం, ఇమెయిల్, వంట వీడియోలు, ఉద్యోగ శోధన, యోగ వీడియోలు, కొత్త తల్లులకు తల్లిదండ్రుల సలహాలు, నూతన వ్యాపారాన్ని ప్రారంభించడంలో వ్యవస్థాపక సహాయం కోసం అనేకమంది మహిళలు ఇంటర్నెట్లో ఆధారపడతారు. చాలామంది మహిళలు అందుబాటులో ఉన్న ఖాళీ సమయములో ఇంటర్నెట్ను వాడుతున్నారు. సాధారణంగా, ఒక మహిళ యొక్క స్వభావం చాలా మంచిది. వారు దయ గల, అమాయక, అంకితమైన, నిజాయితీ మరియు వారు చూసేవి సులభంగా నమ్ముతారు కాని అవి ఎల్లప్పుడూ నిజమైన కాదు. సైబర్ నేరస్తులు మహిళ యొక్క ఉధార స్వభావం వల్ల వారి పైన సైబర్ నేరాలు పెర్గుతున్నాయి.
ఇంటర్నెట్ ఈ డిజిటల్ ప్రపంచంలో మన జీవితాన్ని మరింత అనుకూలమైనదిగా చేసింది, కానీ అది ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంది. వ్యక్తుల అవసారలకు అనుగుణంగా ఇంటర్నెట్ వివిధ అవకాశాలను వారి స్వార్థ ఉద్దేశాలు కోసం అందిస్తుంది. ఈ ఫలితంగా మాల్వేర్, ఫిషింగ్, ఫార్మింగ్, ఐడెంటిటీ దొంగతనం, స్పూఫింగ్, ఆన్లైన్ స్కామ్లు, వైరస్, ట్రోజన్, రంసంవేర్ మరియు మరిన్ని ఇటువంటి పలు బెదిరింపులకు తెగిస్తారు. ఈ సైబర్ ప్రపంచంలో మహిళలు ఎలా సురక్షితంగా ఉంటారో మన మనస్సులో ఒక పెద్ద ప్రశ్న. ఈ డిజిటల్ అనుసంధాన ప్రపంచంలో, మహిళలు వేధింపులకు గురవ్తున్నారు, బెదిరించబడుతున్నారు. కాని దానికి చింతిచాల్సిన అవసరం లేదు, మనము చిన్న చిన్న జగ్రతలు తీసుకోవడము వల్ల ఈ సైబర్ ప్రపంచంలో చాలా సురక్షితంగా ఉండవచ్చు.
భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (ISEA) ఫేజ్ II ప్రాజెక్ట్ తో సాధారణ ప్రజలను ప్రోత్సహించడం మరియు అవగాహన కల్పిస్తుంది. ప్రత్యేకముగా మహిళలకు సైబర్ భద్రత పై మార్గదర్శకాలను సృష్టించి, ఈ డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ఉండేలాగా ప్రోత్సహిస్తుంది. www.infosecawareness.in నుండి ఈ మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా మహిళలు తమను తాము రక్షించుకోవచ్చు మరియు ఇతర మహిళలు సహచరుల్లో ఈ అవగాహనను విస్తరించడంలో పాల్గొనాలి. సైబర్ అవగాహనలో పాల్గోనండి మరియు భారతదేశంను సైబర్ అవగాహన గల దేశంగా మార్చండి.